Jack OTT : ఓటీటీలోకి సిద్దూ జొన్నలగడ్డ డిజాస్టర్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గుంటూరు టాకీస్, డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ చిత్రాలతో యూత్‌లో క్రేజ్ సంపాదించారు సిద్ధూ జొన్నలగడ్డ. విభిన్న కథలు, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌తో సెపరేట్ క్రేజ్ సంపాదించారు సిద్ధూ. ఆయన నటించిన తాజా చిత్రం జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఇందులో సిద్ధూ సరసన హీరోయిన్‌గా నటించడంతో పాటు చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో జాక్‌పై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 10న థియేటర్‌లలోకి వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జాక్ ఏ ఓటీటీలో? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? అనేది చూస్తే :

Jack OTT Release here is the siddhu jonnalagadda and vaishnavi chaitanya s Movie ott streaming details

జాక్ బడ్జెట్ బడ్జెట్ ఎంత

జాక్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాష్‌లు కీలకపాత్ర పోషించారు. అచ్చు రాజమణి, శామ్ సీఎస్, సురేష్ బొబ్బిలిలు ఈ సినిమాకు సంగీతం అందించగా.. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా టాలీవుడ్ సమాచారం

జాక్ ఈవెన్ టార్గెట్ ఎంత

టిల్లూ స్క్వేర్ సినిమా తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న సినిమా కావడంతో పాటు ఆయన సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ కావడంతో జాక్‌పై మంచి బజ్ నెలకొంది. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా దీనికి హెల్ప్ కావడంతో జాక్‌ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. సిద్ధూ జొన్నలగడ్డ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.18 కోట్ల షేర్.. రూ.36 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

జాక్ టోటల్ కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా 850 స్క్రీన్‌లలో ఏప్రిల్ 10న జాక్ చిత్రాన్ని భారీగా విడుదల చేశారు. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. తొలి రోజు రూ. 2.5 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతూనే ఉంది. రెండో రోజు రూ.1.01 కోట్ల నెట్, మూడో రోజున రూ.1.13 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.1.05 కోట్ల నెట్, ఐదో రోజున రూ.62 లక్షలు నెట్, ఆరో రోజున రూ. 46 లక్షలు నెట్, ఏడో రోజున రూ.37 లక్షల నెట్, ఎనిమిదవ రోజున రూ.28 లక్షల నెట్ రాబట్టింది.

మొత్తంగా 8 రోజుల వరకు జాక్ చిత్రం ఇండియా వైడ్ రూ.7.4 కోట్ల నెట్ .. రూ.9 కోట్ల గ్రాస్ రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ట్రేడ్ వర్గాల అంచనాను బట్టి ఈ సినిమా దాదాపు 25 కోట్ల రూపాయల నష్టాలను అందించింది. అయితే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా కొంత మేర నిర్మాత సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

జాక్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

రెండు వారాలకే థియేట్రికల్ రన్ ముగించిన జాక్ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్‌ చివరి నాటికి జాక్ ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. అయితే అనివార్య కారణాలతో కాస్త ఆలస్యమైంది. స్పై, యాక్షన్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన జాక్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఈ సంస్ధ ప్రకటించింది. మే 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జాక్ అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. థియేటర్‌లో ఫెయిలైన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X