థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీని షేక్ చేస్తోన్న జాక్.. సిద్ధూ జొన్నలగడ్డ‌ సరికొత్త రికార్డ్

ఇటీవలి కాలంలో చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కథ బాగుంటే ఓటీటీలలో సినిమాలను జనం ఆదరిస్తున్నారు. థియేటర్‌లో ఫెయిలైన కొన్ని సినిమాలు ఓటీటీలలో దుమ్మురేపుతున్నాయి. నిర్మాతలను సేఫ్ జోన్‌లో పడేస్తున్నాయి. స్టార్ క్యాస్టింగ్, హిట్ కాంబినేషన్‌ అయితే ఓటీటీ రైట్స్ ద్వారానే కోట్లాది రూపాయల లాభాలను అందుకోవచ్చని ప్రూవ్ చేస్తున్నాయి. తాజాగా థియేటర్‌లో ఫెయిలైన ఓ తెలుగు చిత్రం ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది ఈ వివరాల్లోకి వెళితే..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం

గుంటూరు టాకీస్, డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ చిత్రాలతో యూత్ ఆడియన్స్‌లో పాపులర్ అయ్యారు సిద్ధూ జొన్నలగడ్డ. బొమ్మరిల్లు వంటి ఇండస్ట్రీ హిట్‌తో దూసుకొచ్చి తర్వాత అడ్రస్ లేకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం జాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

Jack OTT Release siddu jonnalagadda s movie trending in netflix

జాక్‌పై భారీ అంచనాలు

ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాష్‌లు కీలకపాత్ర పోషించారు. అచ్చు రాజమణి, శామ్ సీఎస్, సురేష్ బొబ్బిలిలు ఈ సినిమాకు సంగీతం అందించగా.. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో హైప్ తెచ్చుకున్న జాక్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో సిద్ధూ జొన్నలగడ్డ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.18 కోట్ల షేర్.. రూ.36 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు

25 కోట్ల నష్టాలను మిగిల్చిన జాక్

ప్రపంచవ్యాప్తంగా 850 స్క్రీన్‌లలో విడుదలైన జాక్ సినిమా .. మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు రూ. 2.5 కోట్లు, రెండో రోజు రూ.1.01 కోట్ల నెట్, మూడో రోజున రూ.1.13 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.1.05 కోట్ల నెట్, ఐదో రోజున రూ.62 లక్షలు నెట్, ఆరో రోజున రూ. 46 లక్షలు నెట్, ఏడో రోజున రూ.37 లక్షల నెట్, ఎనిమిదవ రోజున రూ.28 లక్షల నెట్ వసూలు చేసింది. అంచనాలను అందుకోలేక థియేట్రికల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.9 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టి భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా కారణంగా నిర్మాత దాదాపు రూ.25 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

మే 8 నుంచి ఓటీటీలోకి

థియేటర్లలో ఫెయిలైన జాక్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. మే 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జాక్ స్ట్రీమ్ అవుతోంది. అయితే అనూహ్యంగా ఈ స్పై, కామెడీ సినిమా ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకుంది. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా నెట్‌ఫ్టిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో జాక్ సినిమా టాప్ 2లో ట్రెండ్ అవుతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో సిద్ధూ జొన్నలగడ్డ అభిమానులు కాస్తంత ఊరట చెందుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X