OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'బాహుబలి ఫ్లేవర్' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటించి... ఇప్పుడు విలన్ గా, హీరోకు ఫాదర్ రోల్స్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంది. ఇక తాజాగా జగపతిబాబు నటించిన చిత్రం రుద్రంగి. ఇక ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...
విలక్షణ నటుడు...:జగపతి బాబు.. ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు.. స్టార్ హీరోలకు విలన్ చేస్తూ.. తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. జగపతి బాబు అటు విలన్ గా.. మరోవైపు సహాయ నటుడిగా పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇక ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు.. ఇప్పుడు ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

నెలరోజులు కాకముందే..:ఇదిలా ఉంటే.. ఆయన నటించిన తాజా చిత్రం రుద్రంగి. ఇక ఈ సినిమాలో జగపతిబాబు.. వినుత్నమైన పాత్రలో నటించి.. ప్రేక్షకుల నుంచి మెప్పును పొందాడు. ఈ సినిమా జూలై 7న థియేటర్లలో రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది.
సడెన్ గా ఓటీటీలోకి..:అయితే జగపతి బాబు నటించిన రుద్రంగి.. ఓటీటీలోకి వస్తున్నట్లు ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రుద్రంగి మూవీ మంగళవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ప్రేక్షకులకు సడెన్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారు.. ఈ సినిమాను ఓటీటీలో ఓ సారి చూడవచ్చు.

తెలంగాణ యాసలో...:ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. జగపతిబాబుతో పాటు విమలా రామన్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలు పోషించారు. రుద్రంగి సినిమాకు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో బాహుబలి ఫ్లేవర్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ మూవీ తెలంగాణ యాసతో ఉంటుంది.

పాన్ ఇండియా మూవీస్ లో...:ఈ సినిమా ప్రమోషన్స్‌లో హరీష్‌రావు, బాలకృష్ణతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో రుద్రంటి అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం జగపతి బాబు సలార్, పుష్ప 2, గుంటురు కారం సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.


Click it and Unblock the Notifications











