Paatal Lok Season 2 : ఓటీటీలోకి సూపర్‌హిట్ క్రైమ్ థ్రిల్లర్ .. ఎందులో చూడాలంటే?
ఓటీటీ ప్రపంచంలో లేని జోనర్ అంటూ ఏం లేదు. లవ్, రొమాన్స్, ట్రాజెడీ, సస్పెన్స్, క్రైమ్, హార్రర్, యాక్షన్ ఇలా ఎవరికి ఏది కావాలంటే ఆ సబ్జెక్ట్ రెడీ టూ వాచ్ అన్నట్లుగా ఉంటాయి. అందుకే ఓటీటీలు జనానికి అంతగా కనెక్ట్ అయ్యాయి. వేలకు వేలు సమర్పించుకుని థియేటర్‌లో సినిమా చూసేకంటే ఓ పది రోజులు పోయాక కుటుంబంతో హాయిగా ఇంట్లోనే కూర్చొని సినిమా చూస్తే ఆ మజానే వేరు. ఇలాంటి వారి కోసం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు , వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్‌తో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు రెడీగా ఉంటాయి.
తాజాగా క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారి కోసం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే పాతాల్ లోక్ 2. భారతదేశంలో కోవిడ్ , లాక్‌డౌన్ సమయంలో ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇలాంటి వాటిలో పాతాల్ లోక్ కూడా ఒకటి. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్మ శర్మ తన క్లీన్ స్లేట్ ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మించడం విశేషం. ఆమె ప్రొడ్యూసర్ కావడంతోనే పాతాల్ లోక్‌కు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది.

సుదీప్ శర్మ రచనలో అవినాష్ - ప్రొసిత్ రాయ్‌లు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో జైదీప్ అహ్లావత్, గుల్ పనాగ్ , అభిషేక్ బెనర్జీ, స్వస్తిక ముఖర్జీ కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇన్స్‌పెక్టర్ హాథీ రామ్ చౌదరిగా జైదీప్ అద్భుతంగా నటించారు. న్యూస్ ఛానెల్‌ను చంపడానికి ఢిల్లీలో దిగిన నలుగురు కిరాయి హంతకుల బారి నుంచి అతనిని ఎలా రక్షించారు? అసలు ఆ జర్నలిస్ట్‌ను చంపాల్సిన అవసరం ఏంటి? దీని వెనుక ఎవరున్నారు? కేసును ఇన్స్‌పెక్టర్ హాతీరామ్ ఎలా ఛేదించారు అన్నదే పాతాల్ లోక్ -1 కథ.
కొన్నేళ్ల క్రితం దేశాన్ని వణికించిన తెహల్కా ఘటనకు సంబంధించి తరుణ్ తేజ్ పాల్ రాసిన ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్ పుస్తకం ఈ వెబ్ సిరీస్ తీయడానికి ప్రేరణ అని మేకర్స్ పలు సందర్భాల్లో తెలిపారు. సమాజాన్ని మార్చడానికి ఎంతో శ్రమించిన ఓ జర్నలిస్ట్ కూడా ఎలా పతనమయ్యాడు. తన విలువను, నైతికతను ఎలా కోల్పోయాడన్నది ఈ వెబ్ సిరీస్‌లో అద్భుతంగా చూపించారు.

ఓటీటీలలో ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న పాతాల్ లోక్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ ఉంటుందని ముందే హింట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా కీలక ప్రకటన చేశారు. పాతాల్ లోక్ సీజన్ పార్ట్ 2ని జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తాజా సిరీస్‌లో జైదీప్ అహ్లావత్‌తో పాటు ఇష్వాక్ సింగ్, తిలోతమా షోమ్, గుల్ పనాగ్ నటిస్తున్నారు. ఇందులో నాగా రెబల్స్ , ఈశాన్య రాష్ట్రాల సమస్యలను ప్రస్తావించినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ వెబ్ సిరీస్ చూసేయండి.


Click it and Unblock the Notifications











