Jailer 2 OTT: ఓటీటీలో జైలర్ 2కు రికార్డు బిజినెస్.. రజనీకాంత్ మూవీకి ఎన్ని కోట్ల డీల్ అంటే?

75 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. గడిచిన దశాబ్ధ కాలంలో ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ వంటి సూపర్‌స్టార్ రెమ్యునరేషన్, బిజినెస్ విషయంలో ఆయనను దాటి వెళ్లిపోయారు. కానీ ఇదంతా తాత్కాలికమేనని ఎప్పటికీ తలైవా.. తలైవా అని నిరూపిస్తున్నారు రజనీ. జైలర్ చిత్రంతో సాలీడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన.. గతేడాది వచ్చిన కూలీతో మరోసారి 500 కోట్ల వసూళ్ల మార్క్‌ను దాటారు. తాజాగా జైలర్‌ 2తో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జైలర్ 2కు రికార్డ్ స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

తన వీరాభిమాని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ జైలర్ 2 సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రజనీ సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, మిర్ణా మీనన్, అన్నా రాజన్, జతిన్ సార్ణా, సూరజ్ వెంజారమూడు తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 12న జైలర్ 2 చిత్రం విడుదల కానుంది.

Jailer 2 OTT Rajinikanth s film Streaming rights snapped by Amazon Prime Video for a Massive Price

ఈ సినిమా షూటింగ్‌ను నెల్సన్ పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. మరో ఇద్దరు సూపర్‌స్టార్లు కూడా జైలర్ 2లో గెస్ట్ రోల్ పోషించనున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తొలుత ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే అనివార్య కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉండగా.. కోలీవుడ్‌లో పెద్ద సినిమాల ఫుటేజ్‌లు లీక్ కావడం కలకలం రేపింది. దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీలోని కీలక సన్నివేశాలు రిలీజ్‌ కాకముందే ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో కోలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే జైలర్ 2లోని కీలక సన్నివేశాలు లీకయ్యాయి. కథలో కీలకమైన 2 సన్నివేశాలు లీక్ అయినట్లుగా చిత్ర యూనిట్‌ దృష్టికి రావడంతో నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది. జైలర్ 2కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా.. జైలర్ 2 సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా జైలర్ 2 ఓటీటీ డీల్ టాక్ ఆఫ్ ది ఇండస్టరీగా మారింది. జైలర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఏకంగా 160 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్‌తో ఈ మేరకు అమెజాన్ డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా అత్యధిక ఓటీటీ బిజినెస్ జరిగిన తమిళ సినిమాగా జైలర్ 2 నిలిచింది. జైలర్ తొలి భాగం ఓటీటీ హక్కుల్ని కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థే దాదాపు 75కు దక్కించుకుంది. ఇప్పుడు రెండో భాగానికి 25 శాతం రేటు పెంచి 160 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దాంతో 75 ఏళ్ల వయసులోనూ రజనీ రికార్డుల మోత మోగిస్తున్నాడని.. జైలర్ 2 రిలీజయి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు ఊహించని విధంగా ఉంటాయని రజనీ అభిమానులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X