Avatar 2 OTT: ఇకనుంచి ఫ్రీగా అవతార్ 2.. ఆ ఓటీటీలో మాత్రమే.. ఎప్పటి నుంచో తెలుసా?
అవతార్ అనే సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. 2009లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన అవతార్ సీక్వెల్ మూవీ Avatar: The Way Of Water (Avatar 2) కూడా డిసెంబర్ 16న విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. బెస్ట్ విజువల్స్ కింద ఆస్కార్ కూడా గెలుచుకుంది. అయితే ఇటీవలే ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది. కానీ అది రెంట్ ప్రాతిపదికన ఉంది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఫ్రీగా చూడొచ్చు అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అవతార్ 2ను ఫ్రీగా ఎప్పుడు చూడొచ్చనే విషయంలోకి వెళితే..

థియేటర్లలో బారులు..
హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్ సిల్వర్ స్క్రీన్ పై సృష్టించిన అద్భుతమైన రంగుల ప్రపంచం అవతార్. 2009లో విడుదలైన ఈ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు.
పండోరా గ్రహం చుట్టూ తిరిగే కథాంశంతో ఒక చక్కటి ప్రేమకథను అద్ది వెండితెరపై ఆవిష్కరించారు. ఇక మరోసారి అలాంటి విజువల్ వండర్ అవతార్ 2ను థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు, సినీ లవర్స్ బారులు తీరిన విషయం తెలిసిందే.

2 బిలియన్ డాలర్లు..
జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుత దృశ్యాకవ్యమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 350 నుంచి 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్ ఖర్చు అయింది. డిసెంబర్ 16న విడుదలైన అవతార్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 2 బిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.

ఆ ఓటీటీల్లో..
పండోరా గ్రహం అనే ఊహజనిత ప్రపంచాన్ని విజువల్ వండర్ గా పరిచయం చేసిన జేమ్స్ కామెరాన్ నీటిలో జరిగే యుద్ధంగా అవతార్ 2ను తీర్చి దిద్దారు. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎంతోమంది ఎదురుచూశారు. అందుకు తగినట్లుగానే ఇటీవలే ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, మూవీఎస్ ఎనీ వేర్, యాపిల్ టీవీ, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎంత ఖర్చు చేయాలంటే..
అవతార్ 2 మూవీ 4కే అల్ట్రా హెచ్‌డీటీఎం రెజల్యూషన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ట్రాక్ తో అవతార్ 2 డిజిటల్ వరల్డ్ లో ప్రదర్శించబడుతోంది. అయితే అవతార్ 2 సినిమాను డిజిటల్ తెరపై చూడాలనుకున్నవారికి ఒక మెలిక పెట్టారు. దాన్ని చూడాలనుకున్న వారు ముందస్తుగా ఆర్డర్ చేసుకోవాలి. అవతార్ 2 ను చూడాలంటే 19.99 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1600.

ఇక నుంచి ఉచితంగా..
ఒకసారి సినిమాను ప్రీ ఆర్డర్ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే సినిమా చూడడం, డౌన్‌లోడ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు. ఇదంతా మొన్నటి మాట. అయితే ఇప్పుడు అవతార్ 2ను ఫ్రీగా చూసేయచ్చు. అది కూడా ఏప్రిల్ 28 నుంచి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన సబ్ స్క్రైబర్స్ కోసం ఏప్రిల్ 28 నుంచి అవతార్ 2ను ఉచితంగా చూపించనుంది. ఇందులో తెలుగుతోపాటు తమిళం, ఇంగ్లీష్, హిందీలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ విషయంపై అధికారికంగా త్వరలో ప్రకటన రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











