Jana Nayagan OTT Release Date:‘జన నాయగన్' ఊహించని ట్విస్ట్.. రిలీజ్‌కు ముందే ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ ?
Vijay's Jana Nayagan OTT Release Date: తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay)నటించిన లేటెస్ట్ మూవీ జననాయకుడు (Jana Nayagan). దళపతి చివరి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల ద్వారా కోట్లాది అభిమానులను అలరించిన విజయ్, ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. 'తమిళగ వెట్రి కజగం (TVK)' పార్టీని స్థాపించి, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన, సినిమాలకు వీడ్కోలు చెబుతున్నానని ప్రకటించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇట్టే వైరలవుతోంది. అలా తాజాగా జన నాయకుడు ఓటీటీ స్ట్రీమింగ్ పై బజ్ క్రియేట్ అయ్యింది.
'జన నాయగన్' సినిమాలో దళపతి విజయ్ 'వెట్రి కొండన్' అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే కాయల్ పాత్రలో హీరోయిన్‌గా నటిస్తుండగా, దత్తత కూతురు విజి పాత్రలో మమితా బైజు కీలకంగా కనిపించనుంది. ఈ చిత్రానికి ప్రధాన ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక ఇతర కీలక పాత్రల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, నాసర్, సునీల్ తదితర నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను సత్యన్ సూర్యన్ నిర్వర్తించారు. ఎడిటింగ్‌ను ప్రదీప్ రాఘవ్ నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి సినిమాకు టెక్నికల్‌గా హై క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

భారీ బడ్జెట్, భారీ బిజినెస్
దర్శకుడు హెచ్ వినోథ్ (H Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, కేవీఎన్ ప్రోడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. నిర్మాతలు వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక విజయ్ చివరి సినిమా కావడంతో, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులకు రికార్డు స్థాయిలో డిమాండ్ ఏర్పడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆడియో, శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం బడా కంపెనీలు పోటీ పడ్డాయన్నది ఇండస్ట్రీ టాక్. లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'జన నాయగన్' ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)ఏకంగా రూ.110-121 కోట్ల వరకు చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది ఒక తమిళ సినిమాకు లభించిన అత్యధిక ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా చెబుతున్నారు. ఇక ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ సుమారు రూ.35 కోట్లకు సొంతం చేసుకోగా, శాటిలైట్ హక్కులతో కలిపి మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.
ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..'జన నాయగన్'కు కేవలం 30 రోజుల థియేట్రికల్ విండో మాత్రమే ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే, ఈ సినిమా ఫిబ్రవరి 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, విడుదలకు ముందే ఓటీటీ డేట్ లాక్ కావడం విజయ్ మార్కెట్‌కు నిదర్శనమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
జన నాయగన్ కథ, నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari)ని ఆధారంగా తీసుకుని రూపొందినదిగా సమాచారం. విజయ్ ఇందులో 'వెట్రి కొండన్' అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన దత్తత కూతురు విజి సాయుధ దళాల్లో చేరాలనే ఆలోచనకు ఎందుకు భయపడుతోంది? ఆ భయానికి కారణం ఏమిటి? దాన్ని అధిగమించేందుకు తండ్రిగా వెట్రి కొండన్ చేసే ప్రయత్నాలే కథాంశం. తండ్రీ-కూతుళ్ల మధ్య బలమైన భావోద్వేగ బంధం, సామాజిక బాధ్యత, చివరిలో పొలిటికల్ టచ్ అన్ని కలిపి ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగంగా కదిలించేలా రూపొందినట్లు ట్రైలర్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











