Janhvi kapoor అడ్డంగా బుక్కైన జాన్వీ కపూర్.. బాయ్‌ఫ్రెండ్‌ గురించి అఫిషీయల్‌గా లీక్!

బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ డేటింగ్, అఫైర్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని ముంబై వీధుల్లోనే కాకుండా పలు చోట్ల వారిద్దరి కనిపించడం తెలిసిందే. అయితే ఏనాడు కూడా తన ప్రియుడు గురించి ఏనాడు గురించి అధికారికంగా వెల్లడించలేదు. తాజాగా తన ప్రియుడి పేరును టెలివిజన్ షోలో చెప్పి నాలుక కరుచుకొన్న విషయంలోకి వెళితే..

జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారాల గురించి మీడియాలో చాలా కథనాలు వినిపించాయి. అయితే అవన్నీ తప్పుడు కథనాలే అంటూ ఆమె నిరూపించింది. అయితే శిఖర్ పహారియాతో తన డేటింగ్ వ్యవహారాన్ని దాచలేకపోయింది. ఏకంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి కూడా కలిసి వచ్చారు.

Jahnavi-Kapoor

శిఖర్, జాన్వీ కపూర్ వ్యవహారం గురించి, వారిద్దరి ప్రేమ కహాని గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా వాటికి బలం చేకూర్చే విధంగా తాజా జాన్వీ, తన సోదరి ఖుషి కపూర్ కలిసి కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ 8 షోలో పాల్గొన్నారు. వారిద్దరూ ప్రోమోలో చేసిన అల్లరి వైరల్ అయింది.

కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నలకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చిలిపిగా, అల్లరిగా సమాధానాలు ఇచ్చారు. నీ మొబైల్‌లో ఫాస్ట్ డైలింగ్‌లో ఉన్న మూడు పేర్లు చెప్పమని అడిగితే.. డాడీ, ఖుషి.. శికూ అంటూ టపటాప చెప్పేసింది. దాంతో తాను చెప్పిన మూడో పేరు ఏమిటో తెలుసుకొని నాలిక కరుచుకొన్నది. దాంతో తన ప్రియుడి గురించి అధికారికంగా వెల్లడించినట్టు అయింది.

Jahnavi-Kapoor-Koffeewithkaran8

ఇదిలా ఉండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ద్వారా జాన్వీ కపూర్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కూతురిగా ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. నందమూరి కల్యాణ్ రామ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X