Jatadhara OTT Release: జటాధర ఓటీటీ రిలీజ్.. సుధీర్ బాబు మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు సుధీర్ బాబు. కానీ ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతోందని అభిమానులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మైథలాజికల్, హార్రర్ కామెడీ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ జోనర్‌లో సినిమాను ట్రై చేశారు సుధీర్ బాబు. అదే జటాధర. ధన పిశాచిని, లంకె బిందెలు, నిధులు, నిక్షేపాల చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ సినిమాలో ధన పిశాచినిగా నటిస్తున్నారు. ఇది ఆమె కెరీర్‌లో తొలి తెలుగు సినిమా కావడం, ఇప్పటికే సోనాక్షి గెటప్ జనాల్లోకి వెళ్లిపోవడంతో జటాధరపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. నవంబర్ 7వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో జటాధర డిజిటల్ పార్ట్‌నర్ ఎవరు? జటాధర ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? ఈ వివరాలు పరిశీలిస్తే..

జటాధర తారాగణం
జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా ఈ జటాధరను నిర్మించారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లు ఈ జటాధర చిత్రానికి దర్శకత్వం వహించారు. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా, శ్రేయా శర్మ, ఇందిరా కృష్ణన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, రవి ప్రకాష్, ఝాన్సీ, రోహిత్ పాఠక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ జటాధర చిత్రానికి రాజీవ్ రాజ్ సంగీత దర్శకత్వం వహించారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రభాత్ ఠాకూర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంధ్య శర్మ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
జటాధర ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
టీజర్, ట్రైలర్ ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కీలకపాత్ర పోషించడంతో జటాధర మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా జటాధర మంచి బిజినెస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జటాధర థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల రూపాయల వరకు జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
జటాధర ఏ ఓటీటీలో అంటే?
జటాధర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఈ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది. అయితే హిందీలో మాత్రం 6 వారాల తర్వాతే జటాధర స్ట్రీమింగ్ కానుంది. దీనిని బట్టి దక్షిణాది భాషలలో డిసెంబర్ మొదటి వారంలో.. హిందీలో డిసెంబర్ చివరి వారంలో జటాధర జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు లేదా ముందుగానే రావొచ్చు. జటాధర ఓటీటీ స్ట్రీమింగ్‌పై త్వరలోనే జీ5 క్లారిటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











