Jawan ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఎక్కడ రిలీజ్? రికార్డు ధరకు రైట్స్!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన జవాన్ చిత్రం కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా తాజాగా 1000 కోట్ల రూపాయలో క్లబ్‌ చేరింది. ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపిస్తున్నది. ఓ పక్క థియేట్రికల్‌గా నిలకడగా బాక్సాఫీస్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. ఇక ఈ సినిమా ఓటీటీ బిజినెస్, ఓటీటీ రిలీజ్ డేట్ వివరాల్లోకి వెళ్లితే..

జవాన్ చిత్రం తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజు 75 కోట్ల రూపాయల వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం ఇండియాలో 680 కోట్ల గ్రాస్ వసూళ్లను, 565 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 335 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంీతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1010 కోట్లు వసూలు చేసింది.

Jawan movie OTT release date and digital rights business details

ఇక జవాన్ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ బిజినెస్ జరిగింది. డిజిటల్ హక్కులకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఓటీటీ హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 250 కోట్ల రూపాయలుకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మకం రికార్డుగా చెప్పుకొచ్చారు.

ఇక రెడ్ చిల్లీస్ బ్యానర్‌తో నెట్ ఫ్లిక్స్ ఒప్పందం ప్రకారం జవాన్ చిత్రం కనీసం 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో అంటే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ లోపు ఈ సినిమా 1200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి స్కోప్ కనిపిస్తున్నది.

Jawan movie OTT release date and digital rights business details

ఇక జవాన్ సినిమా ఓటీటీ వెర్షన్ ప్రత్యేకంగా కాబోతున్నది. ఈ సినిమా థియేటర్‌లో కంటే ఓటీటీలో కొత్త వెర్షన్ ఉంటుంది. థియేటర్ కంటే థ్రిల్లింగ్‌గా సినిమాను చూపించబోతున్నాం అని అట్లీ తెలిపారు. దాంతో థియేటర్‌లో చూసిన దాని కంటే ఓటీటీలో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X