Jawan OTT: 1000 కోట్ల సినిమా ఓటీటీ డేట్ వచ్చేసింది.. థియేటర్లలో చూసింది కాకుండా కొత్తగా!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తూ.. సూపర్ స్టార్‌గా సత్తా చాటుతున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. దాదాపు ఐదేళ్లుగా ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే గత జనవరిలో 'పఠాన్' అనే సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే షారూక్ 'జవాన్' అనే ఫిల్మ్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌పై భారీ స్థాయిలో ఎఫెక్ట్‌ను చూపించింది.
బాలీవుడ్ సీనియర్ హీరో షారూక్ ఖాన్ - కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందిన 'జవాన్'. ఈ మూవీకి ఓవర్సీస్‌లో వేసిన ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అదే ఇండియాలోనూ కంటిన్యూ అవడంతో ప్రేక్షకుల నుంచి స్పందన ఓ రేంజ్‌లో దక్కింది. ఇలా ఈ చిత్రం ఇప్పటి వరకూ 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే, రూ. 600 కోట్లు పైగా నెట్ వసూళ్లను కూడా అందుకుంది. దీంతో ఈ మైలురాళ్లను చేరిన ఏకైక హిందీ చిత్రంగా సరికొత్త చరిత్రను సృష్టించింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను రికార్డు రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం కూడా చేసుకున్నారు.
ముందుకు అనుకున్నట్లుగానే 'జవాన్' సినిమాను నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అంతేకాదు, ఈ సినిమాను థియేటర్లలో చూపించిన వెర్షన్ కంటే ఎక్కువ కంటెంట్ (Extended Cut)తో తీసుకు రాబోతున్నారు. అంటే సినిమా హాళ్లలో ప్రదర్శించిన మూవీ కంటే ఎక్కువ నిడివితో ఇది స్ట్రీమింగ్ కాబోతుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'జవాన్' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











