నేరుగా ఓటీటీలోకి బెస్ట్ థ్రిల్లర్ మూవీ.. కీర్తి సురేష్ సినిమాను ఎందులో చూడాలంటే!
సాధారణంగా సినిమాలు ఎన్నో జోనర్లలో తెరకెక్కుతుంటాయి. అయితే, వాటిలో కొన్నింటికి మాత్రం ఆరంభం నుంచే హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాంటి చిత్రాల్లో థ్రిల్లర్ జానర్ ఒకటి. ఈ తరహా మూవీలకు గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఇలాంటి ఎక్కువగా వస్తున్నాయి. అలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'సైరన్'.
జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో అంటోనీ భాగ్యరాజ్ తెరకెక్కించిన చిత్రమే 'సైరన్'. భార్యను చంపిన కేసులో అరెస్ట్ అయిన హీరో.. పెరోల్‌పై బయటకు వచ్చి పోలీసులకు దొరక్కుండా శత్రువులను మట్టుబెట్టడం అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుని అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

జయం రవి హీరోగా నటించిన 'సైరన్' మూవీని ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. దీనికి కారణం ఇందులో ఫ్లాట్ బాగానే ఉన్నా.. సినిమాను ఆసక్తికరంగా నడిపించకపోవడమే. ఫలితంగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతో ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సైరన్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ సినిమాను సొంతం చేసుకుంది. అంతేకాదు, థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో సదరు సంస్థ ఒప్పందం కూడా చేసుకుంది.

ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటించిన 'సైరన్' మూవీని ఏప్రిల్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ మేరకు తాజాగా సదరు సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. వాస్తవానికి ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఎందుకనో రాలేదు. అంటే ఇప్పుడు ఈ చిత్రం హాట్‌స్టార్ ద్వారా నేరుగా తెలుగులోకి రాబోతుందన్న మాట. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. జయం రవి హీరోగా నటించిన 'సైరన్' చిత్రాన్ని హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుజాత విజయ్‌కుమార్ నిర్మించారు. ఇందులో సముద్రఖని, పెరుమాల్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ పాటను అందించగా.. సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











