Jennifer Lopez ఓటీటీలో జెన్నీఫర్ లోపేజ్ రొమాంటిక్ మూవీ.. ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే?
హాలీవుడ్‌లో పాపులర్ నటి జెన్నిఫర్ లోపేజ్ నటించిన పాప్ ఆల్బమ్ దిస్ ఈజ్ మీ.. నౌ ఓటీటీలో రిలీజ్ అయింది. న్యూయోరికన్ ప్రొడక్షన్స్, బీఎంజీ రైట్స్ మేనేజ్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ మ్యూజిక్ ఫిలింకు డేవ్ మేయేర్స్ దర్శకత్వం వహించారు. ఈ పాప్ సంగీత ప్రధానంగా మారిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఈ సినిమా ఓటీటీలో ఎక్కడ చూడవచ్చు అనే వివరాల్లోకి వెళితే..
దిస్ ఈజ్ మీ.. నౌ మ్యూజిక్ సినిమా వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లేక్, జెన్నిఫర్ లోపేజ్ మధ్య జరిగిన రొమాంటిక్ సంఘటనలను ఆధారంగా చేసుకొని నిర్మించారు. గతంలో వచ్చిన దిస్ ఈజ్ మీ.. ధెన్ అనే సినిమాకు మూడో సీక్వెల్. అంతేకాకుండా జెన్నిపర్ కెరీర్‌లో 9వ స్టూడియో ఆల్బమ్ అని సినీ వర్గాలు తెలిపాయి.

దిస్ ఈజ్ మీ.. నౌ: ఏ లవ్ స్టోరి మ్యూజికల్ మూవీకి జెన్నిఫర్ లోపేజ్, అఫ్లేక్, డేవ్ మేయర్స్ స్వయంగా స్క్రిప్టు అందించారు. ఈ చిత్రంలో ఫ్యాట్ జో, ట్రేవర్ నో, జేన్ ఫొండా, పోస్ట్ మ్యాలోన్, కేకే పాల్మర్, సోఫీయా వెంర్గానా తదితరులు నటించారు. ఈ సినిమా తర్వాత నార్త్ అమెరికాలోని 30 ప్రధాన నగరాల్లో మ్యూజికల్ టూర్ చేయనున్నారు.
ఇక దిస్ ఈజ్ మీ.. నౌ: ఏ లవ్ స్టోరి సినిమా గురించి బెన్ అఫ్లేక్ మాట్లాడుతూ.. మా జీవితంలోని మధురానుభూతులను చాలా అందంగా చూపించబోతున్నాం. అందంతోపాటు అత్యంత ప్రతిభావంతురాలైనా జన్నిఫర్‌ను చూసిన మొదటి క్షణం నుంచి మా జీవితంలోకి వచ్చిన రొమాంటిక్ మూమెంట్స్ గురించి చెప్పబోతున్నాం అని అన్నారు.

జెన్నీఫర్ లోపేజ్, బెన్ అఫ్లేక్ జీవితంలో జరిగిన సంఘటనలు, దాంపత్య జీవితంలోని అనుభవాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మ్యూజిక్ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. రొమాంటిక్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్ అని నెటిజన్లు అంటున్నారు.


Click it and Unblock the Notifications











