ఆ ఓటీటీలోకి మోస్ట్ కాంట్రవర్శీ మూవీ.. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేలా!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చాలానే రూపొందుతోన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఇలాంటి చిత్రాలు కొన్ని ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాయి. అలాంటి వాటిలో 'యాత్ర 2' ఒకటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర'కు ఈ చిత్రం సీక్వెల్‌గా రూపొందిన విషయం తెలిసిందే.
మహీ వీ రాఘవ్ డైరెక్షన్‌లో తమిళ హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'యాత్ర 2'. ఈ మూవీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్టోరీతో రూపొందింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు, వాటి నుంచి బయట పడి సీఎంగా ఎదిగిన తీరుతో దీన్ని రూపొందించారు. దీంతో ఈ చిత్రం భారీ అంచనాలతో ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయింది.

రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన 'యాత్ర 2' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ చాలా దారుణంగా వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్‌లో కూడా ఇది స్పందనను అందుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. ఫలితంగా ఈ సినిమా రన్ కంప్లీట్ అవడంతో పాటు కోట్ల నష్టాలను మిగిల్చింది. తద్వారా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
రాజకీయాల్లో కలకలం రేపే కథతో రూపొందిన 'యాత్ర 2' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి రేటుకు దక్కించుకుంది. కానీ, ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో మాత్రం అమెజాన్ సంస్థ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.

జీవా నటించిన 'యాత్ర 2' సినిమా ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైంది. అయితే, ప్రేక్షకుల మెప్పును ఇది పొందలేకపోవడంతో వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం ఇప్పటికీ స్ట్రీమింగ్‌కు రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం యాత్ర 2 ఏప్రిల్ 19వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ చేశారు. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











