ఓటీటీలోకి వచ్చేస్తున్న యాత్ర 2.. ఎందులో, ఎప్పుడు రాబోతుందంటే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ పడకుండానే వేడి కనిపిస్తోంది. దీన్ని ఇంకాస్త ఎక్కువ పెంచే విధంగా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న సినిమాలు తెరకెక్కుతోన్నాయి. ఇలా ఇప్పటికే కొన్ని మూవీలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన మరో రాజకీయ సినిమానే 'యాత్ర 2'. గతంలో వచ్చి హిట్ అయిన 'యాత్ర'కు ఇది సీక్వెల్‌గా వచ్చింది.
మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'యాత్ర 2'. ఈ సినిమా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్టోరీతో తెరకెక్కింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అతడు ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి నుంచి బయట పడి ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరుతో దీన్ని రూపొందించారు. దీంతో ఈ చిత్రం భారీ అంచనాలతో ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'యాత్ర 2' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్‌లో కూడా ఇది స్పందనను అందుకోవడంలో విఫలం అయింది. వీక్ డేస్‌లో అయితే దారుణంగా పడింది. ఫలితంగా ఈ సినిమా రన్ కంప్లీట్ అవడంతో పాటు కోట్ల నష్టాలను మిగిల్చింది.
క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'యాత్ర 2' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకుంది. ఇక, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.

జీవా నటించిన 'యాత్ర 2' సినిమా ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైంది. అయితే, ప్రేక్షకుల మెప్పును ఇది పొందలేకపోవడంతో వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం మార్చి 2వ వారం నుంచే స్ట్రీమింగ్ అవుతుందని తాజాగా న్యూస్ లీకైంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ చేశారు. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











