OTTలో గుండెల్ని పిండేస్తున్న లవ్ స్టోరీ... ఎందులో చూడాలంటే?
ఓటీటీకి ఆదరణ పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా ఆడియెన్స్ అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. తమిళలంలో సూపర్ హిట్టుగా నిలిచిన ఓ చిత్రం ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఆ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవ్వడంతో మనవాళ్లు చూసి బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. మరో ఫీల్ గుడ్ మూవీ అంటూ నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. అసలు ఆ సినిమా ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. దాని స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం.
కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ కంటెంటుకు అలవాటు పడిపోయారు. ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీసులు ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా ఒక డబ్బింగ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. అదేంటో కాదు.. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన జో. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. తమిళంతో పాటు.. తెలుగులోనూ స్ట్రీమింగ్ వచ్చేసింది. దీంతో మన తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు.

తమిళనాడు జో చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మనవాళ్లు చూడటంతో.. ఆ సినిమా ట్రెండింగ్ గా మారింది. ఇక ఈ సినిమాను చూసిన చాలా మందికి 'ప్రేమమ్', 'హృదయం', 'రాజారాణి' లాంటి హిట్ సినిమాలు గుర్తుకు వచ్చాయి. అలాంటి ఫీల్ గుడ్ మూవీ అంటూ బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక ఈ చిత్రంలోని హీరోయిన్ కుర్రకారుకు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ప్రాణంగా ప్రేమించిన వాళ్లు దూరం అయితే.. మనం చనిపోవాల్సిన అవసరం లేదు.. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు మన జీవితం మారుతుందనే కథాంశంతో ఈ సినిమాను తెరెకక్కించారు. ఈ డైలాగ్ వినగానే అందరికి రాజా రాణి సినిమా గుర్తుకు వస్తుంది. ఇక అలాంటి కథతోనే లవ్ ఫెయిల్యూర్స్ గుండెను పిండేస్తుంది ఈ స్టోరీ.

కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో హీరో పిచ్చొడిలా మారుతాడు. చచ్చిపోవాలనుకుంటాడు. అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో అతని జీవితం మారిపోతుంది. ఇక ఫుల్ ఎమోషన్స్ తో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని మీరు చూడకపోతే.. ఓసారి ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఇంట్లోనే ఎంచాక్క చూసేయండి.


Click it and Unblock the Notifications











