OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ... అస్సలు మిస్ అవ్వొద్దు!

మూవీ లవర్స్ కోసం ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీసులు వస్తుంటాయి. అయితే ప్రేక్షకులు ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి సినిమానే ఓటీటీలోకి వచ్చేసింది. క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. దాని కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

మలయాళం సినిమాలకు సూపర్ రెస్పాన్స్ : మలయాళం సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఎక్కువగా మలయాళం సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎక్కవగా మక్కువ చూపిస్తున్నారు. ఊహించని ట్విస్టులు.. భయపెట్టే కథలతో మలయాళం చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఓటీటీలో ఇతర భాషల చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది.

Joju Georges Crime Suspense Thriller Antony Movie Now Streaming on Aha OTT See Details Here
Brahmamudi February 24th ప్రేమను బయటపెట్టిన రాజ్.. అందరి ముందు కళావతికి ప్రపోజ్ చేసి సర్ ప్రైజ్!

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆంటోనీ : మలయాళంలో ఆకట్టుకున్న సూపర్ హిట్ చిత్రం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆంటోనీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ సినీ ప్రియులను ఆకట్టుకోగా.. 2023 డిసెంబర్ 1న మలయాళంలో విడుదల అయింది. ఇక మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ : మలయాళ బాక్సాఫీస్ వద్ద ఆంటోని చిత్రానికి కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు లభించాయి. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ మూవీ సీన్స్ వైరలవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేమికులు ఎదురు చూశారు.

Joju Georges Crime Suspense Thriller Antony Movie Now Streaming on Aha OTT See Details Here

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ : ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు ఆంటోనీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగులో అందుబాటులో రాగా.. తెలుగు ఆడియోన్స్ కూడా ఖుషి అవుతున్నారు. 'ఆంటోని' సినిమాను మన తెలుగు ఆహా ఓటీటీ డిజిటల్ రైట్స్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 23 నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది కూడా. దీంతో ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

ఆంటోనీ మూవీ కథ విషయానికి వస్తే : తండ్రి కూతురు బాండింగ్ గురించి ఈ సినిమా కథ సాగుతుంది. రాజేష్ వర్మ అందించిన కథతో జోషి ఈ చిత్రాన్ని రూపొందించారు. చాలా కాలం తర్వాత ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ నటించి మెప్పించింది. అలాగే చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయ రాఘవన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సమకూర్చారు. మలయాళంలో అలరించిన ఈ సూపర్ హిట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో చూసి ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X