OTTలోకి రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎంత పెద్ద హీరోల చిత్రాలు అయినా సరే పెద్దగా ఆడలేదు అంటే చాలా నెల కూడా కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి అందరినీ అద్భుతంగా అలరించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిత్రాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది ఎంతో ఇష్టపడే అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు చూడడాన్ని మరింత ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ అద్భుతమైన రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ డాక్యుమెంటర్ ఎంటి, ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని చాలా మంది సినిమాగా మలిచారు. కేవలం సినిమాగానే కాకుండా డాక్యుమెంటరీగా, సీరియల్ గా కూడా రూపొందించారు ఇప్పటికీ దీనికి సంబంధించిన ఓ రెండు మూడు చిత్రాలు రాగా... తాజాగా డాక్యుమెంటరీ వచ్చింది. అదే జూలీ జోసెఫ్ కథ. అయితే కళలోని కోజికోడ్ కూడతాయి గ్రామానికి చెందిన ఆమె 14 సంవత్సరాల్లో మొత్తం ఆరు హత్యలు చేసింది. తన కుటుంబ సభ్యులనే తాను అలా హత్య చేయడం... అప్పట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆమె ఆరు హత్యలకు ఎలా పాల్పడిందో తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.

Jolly Joseph Real Crime Thriller Documentary Curry And Cyanide The Jolly Joseph Case OTT Streaming Details

ముఖ్యంగా 2002లో జూలీ అత్తయ్య అన్నమ్మ థామస్, 2008లో జూలీ మామయ్య టామ్ థామస్, ఆ తర్వాత మూడేళ్లకే భర్త రాయ్ థామస్ చనిపోయాడు. అయితే అత్తయ్య మంచినీళ్లు తాగి చనిపోగా... హార్ట్ ఎటాక్ అని అంతా అనుకున్నారు అలాగే జూలీ మామయ్యది అనుమానాస్పద మృతిగా మిస్టరీగానే ఉండిపోయింది. కానీ జూలీ భర్త మాత్రం ఆర్థిక సమస్యలతో చనిపోయాడని అంతా అనుకున్నారు. కానీ జూలీ అత్తయ్య సోదరుడు మాథ్యూ మాత్రం ఇలా అందరూ చనిపోవడం వెనుక ఏదో కారణం ఉందని భావించాడు. కానీ అతడు తెలుసుకునేలోపే అతడు కూడా చనిపోయాడు.

ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2016లో జూలీ భర్త దగ్గరి బంధువు అయిన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డ కూడా చనిపోయారు. ఆ తర్వాత జచారయ్య, జూలీలు పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలోనే జూలీ మరిదికి అనుమానం మొదలు అయింది. వదినలోని మార్పును గుర్తించిన థామస్ సోదరుడు రోజో పోలీసులకు ఫిర్యాదు చేయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలు అన్నీ చేసింది జూలీయే అని... ముఖ్యంగా సైనైడ్ పెట్టి ఆమే ఈ హత్యలన్నీ చేసినట్లు తేల్చారు. 2019లో జూలీతో పాటు ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన మరో ఇద్దరు నిందితులు ఎమ్ఎస్ మాథ్యూ, ప్రాజీ కుమార్ లను కూడా అరెస్ట్ చేశారు.

Jolly Joseph Real Crime Thriller Documentary Curry And Cyanide The Jolly Joseph Case OTT Streaming Details

కేరళలో జరిగిన ఈ క్రైమ్ స్టోరీపై అనేక చిత్రాలు రాగా.. ఇటీవల మరో డాక్యుమెంటరీ వచ్చింది. అదే "కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసెఫ్ కేస్". ప్రస్తుతం ఈ అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. మీరూ ఓ సారి ఈ అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీని చూసి ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X