Jolly O Gymkhana: 6 నెలల తర్వాత ఓటీటీలోకి ప్రభుదేవా మూవీ.. నవ్వి నవ్వి ఏమైపోతారో?
వినూత్నమైన స్టెప్పులతో, బాడీని స్ప్రింగ్‌లా తిప్పుతూ ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా. దాదాపు 35 ఏళ్లుగా కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. 50 ప్లస్‌లోనూ డ్యాన్స్ చేస్తూ ఎంతోమందికి ఇన్స్‌పిరేషన్‌గా నిలిచారు ప్రభుదేవా. ఇండియన్ డ్యాన్స్‌కు ఐకాన్‌గా మారిన ప్రభుదేవాను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది యువతీ యువకులు కొరియోగ్రాఫర్లుగా మారారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా వెలుగొందుతున్న వారిలో చాలా మంది ప్రభుదేవా శిష్యులే. కొరియోగ్రఫితో పాటు ఆయన అప్పుడప్పుడూ సినిమాలలో నటిస్తూ అలరిస్తున్నారు. గతేడాది ప్రభుదేవా నటించిన జాలీ ఓ జింఖానా దాదాపు ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఈ వివరాల్లోకి వెళితే..
శక్తి చిదంబరం దర్శకత్వం
శక్తి చిదంబరం దర్శకత్వంలో జాలీ ఓ జింఖానా చిత్రం తెరకెక్కింది. ఇందులో ప్రభుదేవా, మడోన్నా సెబాస్టియన్, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌లి, రోబో శంకర్, పూజిత పొన్నాడ తదితరులు నటించారు. ట్రాన్సిండియా మీడియా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేంద్ర ఎం రాజన్, పునీత రాజన్‌లు జాలీ ఓ జింఖానా సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఎంసీ గణేశ్ చంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. అశ్విన్ వినాయగ మూర్తి స్వరాలు సమకూర్చారు. నవంబర్ 22, 2024న జాలీ ఓ జింఖానా సినిమా తమిళంలో విడుదలైంది.

హత్య కేసులో కామెడీ మిక్స్ చేసి
జాలీ ఓ జింఖానా చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శక్తి చిదంబరం తెరకెక్కించారు. ఇందులో ప్రభుదేవా ఓ లాయర్‌గా నటించారు. అనుకోని పరిణామాల మధ్య ఓ వ్యక్తిని తల్లి, ముగ్గురు కూతుళ్లు హత్య చేస్తారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఓ శవాన్ని తీసుకొచ్చి నాటకం ఆడతారు. వారికి ప్రభుదేవా సాయం చేస్తాడు. మరి ఈ కేసు నుంచి ఆ తల్లీ కూతుళ్లు బయటపడ్డారా? అసలు వారు హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు అన్నదే జాలీ ఓ జింఖానా సినిమా కథ.
బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ప్రభుదేవా
టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై బాగానే బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే బాక్సాఫీస్ వద్ద జాలీ ఓ జింఖానా దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. 17 రోజుల వరకు ఈ సినిమా ఇండియాలో కేవలం రూ.49 లక్షల నెట్, రూ.53 లక్షల గ్రాస్ మాత్రమే ఆర్జించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జాలీ ఓ జింఖానా డిజిటల్ రైట్స్‌లను ఆహా సొంతం చేసుకుంది. అనంతరం థియేటర్‌లో విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత డిసెంబర్ 30, 2024న ఆహా తమిళంలో తొలుత అందుబాటులోకి వచ్చి మా ఆదరణను దక్కించుకుంది.
ఆరు నెలల తర్వాత తెలుగులోకి
థియేటర్‌లో రిలీజైన ఇప్పటి వరకు జాలీ ఓ జింఖానా చిత్రం తెలుగులో అందుబాటులోకి రాకపోవడంతో తెలుగు ఓటీటీ లవర్స్ డిజప్పాయింట్ అయ్యారు. దీంతో ఆహా ఓటీటీ ఈ సస్పెన్స్‌కు తెరదించింది. థియేటర్‌లో రిలీజైన దాదాపు ఆరు నెలల తర్వాత తెలుగులో జాలీ జింఖానా సైలెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ తమిళ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











