బాలీవుడ్ పాపులర్ షోకి లాంచింగ్‌కి గెస్ట్‌గా ఎన్టీఆర్ .. రోహిత్ శర్మతో ఒకే వేదికపై యంగ్ టైగర్!
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న దేవర పార్ట్ -1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే సెప్టెంబర్ 10న ట్రైలర్ రిలీజ్ చేసిన దేవర యూనిట్ త్వరలోనే భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేసింది. పాన్ ఇండియా మూవీ కావడంతో హిందీ బెల్ట్ కోసం మరో ఎత్తుగడ వేసింది . ఆ వివరాల్లోకి వెళితే..
జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న దేవరపై భారీ అంచనాలున్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీకి సీబీఎఫ్‌సీ యూ/ఏ సర్టిఫికెట్ మంజూరు చేయగా.. టోటల్ రన్ టైమ్ 3 గంటల వరకు వచ్చింది.

సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులు చీఫ్ గెస్ట్‌లుగా రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో వారిద్దరూ ఈవెంట్‌కు వస్తారని టాలీవుడ్ టాక్. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన ఉంది. ఒకవేళ ఇదే నిజమై ఎన్టీఆర్, మహేశ్, పవన్ కళ్యాణ్‌లను ఒకే వేదికగా చూడటానికి అభిమానులు సిద్ధం.
పాన్ ఇండియా మూవీ కావడంతో నార్త్ ఇండియాలోనూ దేవరను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కారణంగా ఉత్తరాదిలోనూ ఎన్టీఆర్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్‌లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఎస్ఎస్ రాజమౌళి వాడిన స్ట్రాటజీ వాడుతోంది యూనిట్. అదే కపిల్ శర్మ షో.. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ షో.. బుల్లితెరపై సంచలనం సృష్టించింది. ఎంతో మంది సెలబ్రెటీలను కపిల్ శర్మ ఇంటర్వ్యూ చేసే విధానానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ప్రస్తుతం కపిల్ శర్మ షో ఓటీటీలలోకి ప్రవేశించింది. కొద్దినెలల క్రితం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఫస్ట్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమై మంచి వ్యూస్ సంపాదించింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ షో సెకండ్ సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు అలియా భట్, కరణ్ జోహార్లు తళుక్కున మెరిశారు.
ఇదే షోలో దేవర టీమ్ నుంచి ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్‌లు కూడా వచ్చారు. తన జోకులు, పంచ్ డైలాగ్స్‌తో ఎన్టీఆర్ షోను రక్తికట్టించారు. గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ , చరణ్‌లు కపిల్ శర్మ షోకు హాజరైన సంగతి తెలిసిందే. మరి కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











