OTT: ఓటిటిలో "దేవర"డామినేషన్.. 2024 గ్లోబల్ లెవెల్లో భారీ వ్యూస్ తో అట..

NTR Devara: ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు బిగ్గెస్ట్ చిత్రాలు కొన్నే ఉన్నాయని చెప్పాలి. కాగా లేటెస్ట్ గా అయితే పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అవైటెడ్ చిత్రం పుష్ప 2 మేనియా కనిపిస్తుండగా దీనికి ముందు మన తెలుగు స్టార్స్ చేసిన చిత్రాల్లో "దేవర" పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో తాను రెండో సినిమాగా హాలీవుడ్ లెవెల్ హంగులతో అయితే తెరకెక్కించారు.

మరి థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ గా మంచి వసూళ్లనే ఈ చిత్రం అందుకుంది. కొడితే దెబ్బకి ఎన్టీఆర్ ఖాతాలో సోలోగా 500 కోట్ల గ్రాస్ సినిమా వచ్చి పడింది. ఇలా వరల్డ్ వైడ్ మంచి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మన తెలుగు స్టేట్స్ లో కూడా మాసివ్ నంబర్స్ సెట్ చేసి పెట్టింది. ఇంట్రెస్టింగ్ గా ఒక్క ఏపీలోనే 100 కోట్ల షేర్ ని అందుకున్న సినిమాగా ఇది నిలిచి దుమ్ము లేపింది.

Jr NTR Devara movie global domination in netflix 2024

ఇలా థియేటర్స్ లో దేవర మిక్స్డ్ టాక్ లో కూడా రికార్డులు నమోదు చేయగా ఈ తర్వాత ఓటిటిలో విడుదలకి వచ్చింది. కాగా దేవర పాన్ ఇండియా సహా పాన్ వరల్డ్ ఓటిటి హక్కులని కూడా వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 150 కోట్లకి పైగా పెట్టి కొనుగోలు చేసింది. అయితే ఇందులో వచ్చిన తర్వాత దేవర అక్కడ కూడా వెంటనే ట్రెండింగ్ లోకి రాలేదు.

నెమ్మదిగా ట్రెండింగ్ లోకి వచ్చి సత్తా చాటింది. మొదట పాన్ ఇండియా భాషల్లో వచ్చిన ఈ చిత్రం నెక్స్ట్ పలు విదేశీ భాషల్లో కూడా వచ్చింది. కొరియన్, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా పలు భాషల్లో దేవర రాగా ఇపుడు గ్లోబల్ వైడ్ గా 2024 ఏడాది లోనే హైయెస్ట్ ట్రెండ్ అయ్యిన సినిమాగా నిలిచినట్టు చిత్ర యూనిట్ దేవర మేనియా కోసం చెబుతున్నారు.

ఈ 2024 లో కంటిన్యూగా నాలుగు వారాలు టాప్ లో ట్రెండ్ అయ్యిన తెలుగు సినిమాగా నిలవగా వరల్డ్ వైడ్ అయితే మొత్తం 7 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా ట్రెండ్ అవుతుందట. ఇంతే కాకుండా ఇప్పుడు వరకు 28 లక్షలకి పైగా వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో అందుకున్న ఈ చిత్రం 81 మిలియన్ గంటలు నెట్ ఫ్లిక్స్ లో వీక్షించబడి కొనసాగుతుందట.

దీనితో దేవర సినిమా ఓటిటిలో కూడా భారీ డామినేషన్ కనబరుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఆ సినిమా తోనే తాను టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ భారీ సినిమాని మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు రెండు భాగాలుగా తెరకెక్కించగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించాడు.

More from Filmibeat

Read more about: jr ntr janhvi kapoor devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X