Devara: దేవర ఓటీటీ వివరాలు లీక్.. స్ట్రీమింగ్‌ డేట్‌పై బ్యాడ్ న్యూస్

టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే యాక్టింగ్ పరంగా సినీ ప్రియులను ఫిదా చేస్తూ మంచి పేరుతో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఆరంభం నుంచీ తనదైన సినిమాలతో సందడి చేస్తోన్న అతడు.. ఈ మధ్య ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు 'దేవర' అనే చిత్రం చేశాడు.

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాను చేశాడు. కోస్టల్ ఏరియాల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దీంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

Jr NTR Starrer Devara Movie OTT Partner and Streaming Date Details

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'దేవర' సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన అంటే నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే దీనికి ఆడియెన్స్ మంచి స్పందన కూడా లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగానే లభించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని కూడా నిర్మాతలకు ముట్టజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తెలిసింది. అంటే సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ చిత్రం నవంబర్ 3 వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

Jr NTR Starrer Devara Movie OTT Partner and Streaming Date Details

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - కొరటాల కలయికలో రూపొందిన 'దేవర' మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Read more about: devara jr ntr devara ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X