Devara OTT Release Date : ఓటీటీలోకి దేవర.. ముందుగా అనుకున్నట్లే, స్ట్రీమింగ్ ఎందులో అంటే?

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర చిత్రం ఘన విజయం సాధించింది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కోలుకుని సక్సెస్ కొట్టింది. కేవలం ఏడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకుని బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టిన ఎన్టీఆర్ తనను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరికలు పంపారు. అన్నింటికి మించి దర్శకుడు కొరటాల శివకు బిగ్‌ రిలీఫ్‌ను కలిగించింది దేవర. థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోన్న దేవర కోసం ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలు మీకోసం.

ఏపీ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని రత్నగిరి ప్రాంతంలోని సముద్రానికి దగ్గరగా ఉండే కొండపై నాలుగు ఊళ్లని కలిపి ఎర్ర సముద్రంగా పిలుస్తారు. అక్కడి ప్రజల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్)లు వాళ్ల ముఠాతో కలిసి సముద్రం మీదుగా వెళ్లే నౌకలపై దాడి చేసి దోపిడీలు చేస్తుంటారు. వీళ్ల ద్వారా మురుగ (మురళీశర్మ) గ్యాంగ్ .. ఆయుధాలను ఒడ్డుకు చేరుస్తుంటాడు. అయితే ఇది ఎప్పటికైనా తమ వాళ్లకి ప్రమాదంగా మారుతుందని గ్రహించిన దేవర ఆ పనులను మానేసి వేరే రకంగా ఉపాధి పొందుతాడు.

Jr NTR s devara ott release date confirmed by netflix here s the details

కానీ భైర మాత్రం ఈ పనులను చేస్తుండగా దేవర అడ్డుపడతాడు. దీంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని భైర భావిస్తాడు. దేవర మాత్రం ఎవరికి కనిపించకుండా భైర గ్యాంగ్‌ని ఎదుర్కొంటాడు. అతనికి భయపడి సముద్రంలోకి వెళ్లాలంటేనే భైర గ్యాంగ్ భయపడుతుంది.. అలా ఎన్నాళ్లు కొనసాగింది, దేవర కొడుకు వర (ఎన్టీఆర్), అతనిని ప్రేమించిన తంగం (జాన్వీ కపూర్) ఎవరు అన్నదే ఈ చిత్ర కథ.

దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్‌తో పాటు టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

Jr NTR s devara ott release date confirmed by netflix here s the details

తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌తో బరిలో దిగిన దేవర 23 రోజులకు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్, రూ.250 కోట్లకు పైగా షేర్ అందుకుని లాభాలను పంచింది. ఈ నేపథ్యంలో దేవరను ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దేవర డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే నవంబర్ 8న దేవరను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. అయితే అంతకంటే ముందే దీపావళి కానుకగా దేవర ఓటీటీలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాలకు ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాలి. దీనిని బట్టి అక్టోబర్ నెలాఖరుకు దేవర నాలుగు వారాల పీరియల్ కంప్లీట్ చేసుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్ కావాలనుకుంటే దేవర మేకర్స్‌తో చర్చించి స్ట్రీమింగ్ డేట్‌ను ముందుకు జరపొచ్చు. మరి దేవర షెడ్యూల్ ప్రకారమే ఓటీటీలోకి వస్తుందా ? లేదంటే ముందే పలకరిస్తుందా అన్నది వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: jr ntr koratala siva devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X