Devara : ఓటీటీలలో దేవర రేర్ ఫీట్ .. మహేశ్, ప్రభాస్‌లను కొట్టేసిన ఎన్టీఆర్ , 3 రోజుల్లోనే!
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించగా కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసిన దేవర రీసెంట్‌గా ఓటీటీలలోకి అడుగుపెట్టాడు. స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ఇక్కడ ఎలాంటి రికార్డులు రాబట్టాడో చూస్తే.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రచార కార్యక్రమాలు ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో దేవరపై భారీ హైప్ నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల వ్యాపారం చేసింది దేవర. దీంతో రూ.184 కోట్ల షేర్, రూ.380 కోట్లను బ్రేక్ ఈవెన్‌గా విలువ కట్టారు.

తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న దేవర ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిందంటే దానికి కారణం ఎన్టీఆర్ మాస్ ఇమేజ్. దీనికి దసరా సీజన్ , వరుస సెలవులు కలిసిరావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. మధ్యలో రజనీకాంత్ నటించిన వేట్టయన్ సహా పలు చిన్నా పెద్దా సినిమాలు పోటీకి వచ్చినా దేవర దూకుడు తగ్గలేదు. వర్కింగ్ డేస్‌లో డల్ అయినా వీకెండ్స్‌లో ఎక్స్‌లెంట్ హోల్డ్ చూపిస్తూ 24 రోజుల పాటు రోజుకు కోటి తగ్గకుండా షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
47 రోజుల వరకు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.421.18 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 225, హిందీలో రూ. 65 కోట్లు, కన్నడంలో రూ. 3.5 కోట్లు, తమిళంలో రూ. 7.8 కోట్లు, మలయాళంలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 78 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మొత్తంగా రూ. 294 కోట్ల నికర వసూళ్లతో రూ. 100 కోట్లకు పైగా లాభాలను అందించింది దేవర.

థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసుకున్న దేవర.. నవంబర్ 8 నుంచి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా ఇక్కడా ప్రభంజనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తొలి వారం నాన్ హిందీ కేటగిరీలో మోస్ట్ వాచ్డ్ కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. మూడు రోజుల్లోనే ఏకంగా 2.2 మిలియన్ల వ్యూస్‌తో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం (2 మిలియన్ వ్యూస్), ప్రభాస్ సలార్ (1.6 మిలియన్ల వ్యూస్)ను అధిగమించి సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలివారమే ఇలా ఉంటే రానున్న రోజుల్లో దేవర ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











