Junior OTT: జూనియర్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ .. కిరీటీ - శ్రీరెడ్డిల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం జూనియర్. యంగ్ హీరోయిన్ శ్రీలీల ఆయన సరసన ఆడిపాడారు. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ జూనియర్ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో జూనియర్ మూవీ ఏ ఓటీటీలో రానుంది? ఓ ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది? ఈ వివరాల్లోకి వెళితే..
అలనాటి సీనియర్ కన్నడ నటుడు డాక్టర్ రవిచంద్రన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమ, పెళ్లి తర్వాత టాలీవుడ్‌కు దూరమైన సీనియర్ హీరోయిన్ జెనీలియా ఈ సినిమా ద్వారా తిరిగి తెలుగువారిని పలకరించారు. రావు రమేష్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు జూనియర్‌లో నటించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

జూనియర్ బడ్జెట్ ఎంత?
కిరీటీ తొలి చిత్రమే అయినప్పటికీ సహజత్వం కోసం రియల్ లోకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో పాటు టీజర్, ట్రైలర్లు జూనియర్ సినిమాపై మంచి బజ్ నెలకొంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
జూనియర్ బిజినెస్& బ్రేక్ ఈవెన్ టార్గెట్
శ్రీలీల ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచారు. ఆమె చేసిన వైరల్ వయ్యారి సాంగ్ సినిమా విడుదలకు ముందే అంచనాలను పెంచేసింది. ఈ కారణం చేత జూనియర్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.16 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ రావాలని వాల్యూ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీ 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు నిర్మాతలు.
జూనియర్ కలెక్షన్స్ ఎంత?
మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న జూనియర్ మూవీకి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు వీకెండ్ కావడంతో సినిమాకు మంచి బుకింగ్స్ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండ్రోజుల్లో జూనియర్ మూవీకి రూ.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు కావొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో అప్పటి వరకు మాత్రమే జూనియర్ సినిమా తన పెట్టుబడిన వెనక్కి తీసుకోవాల్సి ఉంది.
జూనియర్ ఓటీటీ వివరాలు
జూనియర్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. ఫ్యాన్సీ రేటుకు జూనియర్ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ చేసినట్లు టాక్. థియేటర్‌లో విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి రావాలనే ఒప్పందం నేపథ్యంలో జూనియర్ మూవీని ఆగస్ట్ రెండో వారంలో ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. థియేట్రికల్ రన్‌ను బట్టి ఈ డేట్ ముందుకు రావొచ్చు లేదంటే ఆలస్యం కావొచ్చు. త్వరలోనే జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











