OTTలోకి రీసెంట్ హార్రర్ మిస్టరీ మూవీ.. రూ.200 కోట్లు వసూలు చేసిన ఈ మూవీని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే హార్రర్, క్రైమ్, కామెడీ, మిస్టరీ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు కూడా నెల రోజులు తిరక్కముందే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఓటీటీలో అనేక హార్రర్, క్రైమ్, మిస్టరీ చిత్రాలు ఓటీటీలో ఉండగా.. మరో హార్రర్ మిస్టరీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రూ.200 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా.. జ్యోతిక హీరోయిన్ గా వచ్చిన తాజా సినిమానే షైతాన్. అద్భుతమైన మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీతోనే జ్యోతిక బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. అలాగే దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

అజయ్ దేవగన్, జ్యోతికలు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో మాధవన్, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్, పాలక్ లాల్వాణీ, మనోజ్ ఆనంద్, రిచా ప్రకాష్, హితేన్ పటేల్, రోష్ని కౌర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే దీప్ ఫ్రాన్సిసి ఎడిటర్ గా పని చేశారు. 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రూ.167.32 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.
విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్.. షైతాన్ సినిమా హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కులు పొందిన నెట్ ఫ్లిక్స్.. విడుదల తర్వాత 45 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. అందరూ భావించినట్లుగానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. నేట్ ఫ్లిక్స్ వేదికగా మే 3వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో సందడి చేయబోతుంది. ఆ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది.

అదిరిపోయే హార్రర్ మిస్టరీగా రాబోతున్న ఈ సినిమాను చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతీక్షణం నరాలు తెగే ఉత్కంఠను కల్గించే ఈ చచిత్రాన్ని అస్సలే మిస్ కాకండి. వేసవి కాలంలో ఎండలో బయట తిరగకుండా.. ఇంట్లోనే కూర్చుని ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











