‘అర్ధరాత్రి ధడేల్.. ధడేల్.. సందీప్ కిషన్‌తో గడ్డివాములోకి'

తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతున్న లేడీ ఓరియెంటెడ్ టాక్ షోలలో 'కాకమ్మ కథలు'ఒకటి. నటి తేజస్వి మదివాడ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ పుల్ గా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడో సీజన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ షోలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎలాంటి మొహమాటం లేకుండా తమ వ్యక్తిగత జీవితాలను బయటపెట్టేస్తున్నారు. లవ్,రిలేషన్‌షిప్స్, ఫ్యాంటసీలు వంటి విషయాల గురించి బోల్డ్‌గా మాట్లాడేస్తున్నారు. ఈ సారి యూత్ ఆడియన్స్ ను మరింత అట్రాక్ట్ చేయడానికి కాస్త మసాలా యాడ్ చేసినట్టు అనిపిస్తోంది.

Also Read
ఆ స్టార్ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ ఆమెనే..:అఖిల్ అక్కినేని
ఆ స్టార్ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ ఆమెనే..:అఖిల్ అక్కినేని

ఇక తాజాగా నెక్స్ట్ వీక్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌కు ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మౌనీషా చౌదరి (ఈషా బ్లాగ్స్), డ్యాన్సర్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ నైనిక ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వీరిద్దరితో కలిసి తేజస్వి చేసిన బోల్డ్ కామెంట్స్, డబుల్ మీనింగ్ పంచ్‌లు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి.

Kaakamma Kathalu 3 Promo Mounisha Chowdary bold comment on Sandeep Kishan Tejaswi Nainika

ప్రోమోలో మొదటి రౌండ్‌కు "ఆశకు హద్దుండాలి" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ గేమ్‌లో తేజస్వి ట్యాబ్‌లో హీరోల ఫొటోలను స్క్రోల్ చేస్తుండగా, గెస్ట్ "స్టాప్" అనగానే వచ్చిన హీరో గురించి ఒక ఫన్నీ లేదా రొమాంటిక్ ఫ్యాంటసీ చెప్పాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో మౌనీషాకు హీరో సందీప్ కిషన్ ఫొటో వచ్చింది. దీంతో ఆమె తన రొమాంటిక్ ఫ్యాంటసీ చెప్పి అందరికి చెప్పి నవ్వించింది. "వన్ నైట్..ధడేల్..." అంటూ మొదలుపెట్టింది. వెంటనే "అంటే స్నో పడింది" అంటూ మౌనీషా మాట మార్చింది.

Recommended For You
Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!
Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!

కానీ కథను కొనసాగించాలని అనగా.. 'ఇక్కడ ఎవరు లేరా? అని నేను బాధపడుతుంటే.. హీరో సందీప్ కిషన్ వచ్చి, స్నోలో నీ హెయిర్ స్టైల్ పాడైపోతుంది.. పక్కనే గడ్డివాము ఉంది.. అక్కడికి రా అని సందీప్ కిషన్ పిలిచాడు" అంటూ ఫన్నీగా చెప్పింది. దీనికి తేజస్వి అత్రుతగా "ఇంకేం జరిగింది?" అని అడగగా, "రౌండ్స్" అని మౌనీషా చెప్పడంతో యాంకర్ అవునా అంటూ నవ్వేసింది. ఆ వెంటనే మౌనీషా "మీరు అనుకున్న రౌండ్స్ కాదు" అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ, మేము అనుకోలేదని యాంకర్ సైటరికల్ రిప్లే ఇచ్చింది. దీంతో "మీ బుర్రలు నాకు తెలుసు... అవి బూతు బుర్రలు. కెమెరాలు ఆపేయండి... అసలు ఒరిజినల్ స్టోరీ చెబుతా" అని వేసిన పంచ్ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.

You May Also Like
Akhil Raj: ముదిరిన గొడవ.. హీరో అఖిల్ రాజ్‌కు ఊహించని షాక్.. రంగంలోకి పోలీసులు!
Akhil Raj: ముదిరిన గొడవ.. హీరో అఖిల్ రాజ్‌కు ఊహించని షాక్.. రంగంలోకి పోలీసులు!

సిద్ధు జొన్నలగడ్డపై నైనిక ఫన్నీ ఫ్యాంటసీ
తర్వాత నైనికకు హీరో సిద్ధు జొన్నలగడ్డ ఫొటో రావడంతో తేజస్వి "సిగ్గుపడింది కాదు... సిద్ధుపడింది" అంటూ పంచ్ వేసింది. దీనికి నైనిక నవ్వుతూ .."డీజే టిల్లు చూసి వచ్చా.. ఒకరోజు మంచు కొండల్లో భూమ్ భూమ్ చేస్తూ రీల్స్ చేద్దాం" అంటూ తన ఫాంటసీ స్టోరీ చెప్పింది. అయితే ఆ కథలో పెద్దగా రొమాన్స్ లేకపోవడంతో తేజస్వి "ఛీ... ఆపండి. మంచు కొండలకు తీసుకెళ్లి మరీ పాడు చేయాలా?" అంటూ ఫన్నీ సెటైర్ వేసింది.

Toxic Teaser Review: టాక్సిక్ టీజర్ రివ్యూ.. యష్ మాస్ విశ్వరూపం..
Toxic Teaser Review: టాక్సిక్ టీజర్ రివ్యూ.. యష్ మాస్ విశ్వరూపం..

ఈ ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది.కొందరు షోలోని సరదా, ఫ్రీ ఫ్లో గా ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరయితే.. "డబుల్ మీనింగ్ జోక్స్ తప్ప ఇంకేం లేదు" అంటూ కామెంట్ చేస్తున్నారు. అందుకే ప్రతి వారం ప్రోమో విడుదలైన వెంటనే అది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X