ఓటీటీలోకి రానా దగ్గుబాటి డిజాస్టర్ మూవీ.. కాంతను ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
దక్షిణాదిలో స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందించిన చిత్రం కాంత. తమిళ సినిమా పరిశ్రమంలో ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, ఎంఆర్ రాధా లాంటి సినీ లెజెండ్స్ జీవితాలలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో దుల్కర్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీని, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జాను చాంతర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

కాంత సినిమా కథ విషయానికి వస్తే.. తమిళ సినిమా పరిశ్రమలో 1950వ దశకంలో లెజెండరీ యాక్టర్ టీకే మహాదేవన్ త్యాగరాజన్ జీవితంలో జరిగిన కొన్నివేశాలే కాకుండా ఎంఆర్ రాధా, ఎంజీఆర్ లాంటి వ్యక్తుల జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో టాప్ యాక్టర్లందరూ, గొప్ప టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, చిత్ర యూనిట్ రెమ్యునరేషన్, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 80 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపలేకపోయింది. కానీ దుల్కర్, భాగ్యశ్రీ భోర్సే యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమా గురించి క్రిటిక్స్ ప్రతికూలంగా స్పందించడంతో కలెక్షన్లపరంగా పేలవమైన ప్రదర్శన నమోదు చేసుకొన్నది. ఈ చిత్రం తమిళంలో 16 కోట్ల రూపాయలు, తెలుగులో 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 23 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చ చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.
వరల్డ్ వైడ్‌గా కాంత సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో 27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 23 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడగా, ఓవర్సీస్‌లో 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ విషయానికి 35.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది.
కాంత చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. దాదాపు ఈ చిత్రానికి భారీగా అంటే.. సుమారుగా 40 కోట్ల రూపాయలు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం విడుదలకు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది. తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. పిరియాడిక్ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











