Kaantha OTT: కాంత ఓటీటీ రిలీజ్... దుల్కర్ సల్మాన్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడంటే?

నటుడిగా, నిర్మాతగా ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. గతేడాది లక్కీ భాస్కర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆయన.. ఆ తర్వాత లోక చాప్టర్ 1 : చంద్రతో నిర్మాతగా సంచలనం సృష్టించాడు. మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా లోక నిలిచింది. ఇక దుల్కర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో కాంత సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఈ వివరాల్లోకి వెళితే..

కాంత తారాగణం
కాంత చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మరాఠీ ముద్దుగుమ్మ.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్‌లు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా.. స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు అందిస్తున్నారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్‌ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Kaantha OTT Release When And Where To Watch Dulquer Salmaan s Movie Online After Theatrical Run

కాంత బడ్జెట్ ఎంతంటే?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంత సినిమాకు దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. చెన్నై, తమిళనాడు, కేరళలోని పలు అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. 1950ల నాటి భారతదేశం, ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడానికి అద్భుతమైన సెట్స్‌ను వేశారు. నటీనటులు వేష భాషలు, లుక్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కాంత సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగానే పలికినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే అది ఎంత అనే వివరాలు తెలియాల్సి ఉంది.

విడుదలకు ముందే వివాదం
అయితే విడుదలకు ముందే ఈ సినిమా వివాదంలో ఇరుక్కుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తొలితరం సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంకే త్యాగరాజ భగవతార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్‌లను చూసిన త్యాగరాజ్ మనవడు త్యాగరాజు.. తమ కుటుంబ అనుమతి లేకుండా, తమ దృష్టికి తీసుకురాకుండా ఈ సినిమాను తెరకెక్కించారని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కాంత టీమ్‌కి నోటీసులు పంపింది. అలాగే విచారణను నవంబర్ 18కి వాయిదా వేయగా.. నవంబర్ 14న సినిమా రిలీజ్ ఉండటంతో కాంత టీమ్‌ టెన్షన్ పడుతోంది.

కాంత ఏ ఓటీటీలో అంటే?
ఇదిలాఉండగా.. కాంత సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావాలనే ఒప్పందం మేరకు డీల్ సెట్ అయ్యింది. దీనిని బట్టి కాంత చిత్రం డిసెంబర్ 2వ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ వివాదం కారణంగా సినిమా విడుదల ఆలస్యమైతే.. డిసెంబర్ చివరి వారంలో కాంత చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X