Guntur kaaram OTT: గుంటూరు కారం ఓటీటీపై గుడ్ న్యూస్.. ఆ రెండు యాడ్ చేసి.. ఆరోజు నుంచే!

టాలీవుడ్‌లో కొందరు హీరోలు మాత్రమే వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఆ మధ్య వరుసగా విజయాలను అందుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో.. గత చిత్రంతో సరైన సక్సెస్‌ను సొంతం చేసుకోలేదు. దీంతో ఈ సారి భారీ విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో 'గుంటూరు కారం' అనే మూవీలో నటించాడు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన సినిమానే 'గుంటూరు కారం'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్స్ మాత్రం భారీగా లభించాయి.

Recommended Video

Guntur Kaaram OTTలో ఆ Deleted Scenes..నెరవేరిన డిమాండ్ | Mahesh Babu | Telugu Filmibeat

Kabaddi Fight and Mother Song Added in Guntur kaaram Movie OTT Version

ఎన్నో అంచనాలతో విడుదలైన 'గుంటూరు కారం' మూవీకి టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కింది. ఫలితంగా ఈ సినిమా ఇప్పటికే రూ. 240 కోట్ల వరకూ గ్రాస్‌తో పాటు రూ. 110 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసుకుని సత్తా చాటుతోంది. ఇప్పటికి కూడా ఇది థియేటర్లలో సందడి చేస్తూ ప్రేక్షకుల స్పందనను అందుకుంటోంది.

మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం. ఇక, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఓ గుడ్ న్యూస్ లీకైంది.

Kabaddi Fight and Mother Song Added in Guntur kaaram Movie OTT Version

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీ నుంచి తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. దీని స్ట్రీమింగ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచే ప్రారంభం కాబోతుందట. అంతేకాదు, ఇందులో ఓ కబడ్డీ ఫైట్ సీన్‌తో పాటు ఓ అమ్మ సెంటిమెంట్ సాంగ్‌ను కూడా యాడ్ చేస్తున్నారని తెలిసింది. అంటే థియేటర్ వెర్షన్ కాకుండా మరింత నిడివితో ఇది రాబోతుంది.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇక, ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X