ఓటీటీలోకి థ్రిల్ చేసే హర్రర్ సినిమా.. కాజల్ మూవీని ఎక్కడ చూడాలంటే!
ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లో హర్రర్ స్టోరీలతో సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలాంటి చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ తరహా మూవీలు మరిన్ని తెరకెక్కుతోన్నాయి. అలా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంథాలజీ హర్రర్ సినిమానే 'కరుంగాపియం' / 'కాజల్ కార్తీక'. కాజల్ అగర్వాల్ ఇందులో నటించింది.
రెజీనా కసాండ్ర, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో డికేయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'కాజల్ కార్తీక'. పుస్తకాలు చదివే పిచ్చి ఉన్న అమ్మాయికి.. రియల్ స్టోరీల గురించి చెప్పే బుక్ దొరకడం అనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమా భారీ అంచనాలను ఏర్పరచుకుంది.

'కాజల్ కార్తీక' మూవీని 'కరుంగాపియం' పేరుతో గత ఏడాది మే 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. దీనికి కారణం ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. దాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులను మెప్పించలేదు. ఫలితంగా ఈ చిత్రం ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు అనే చెప్పుకోవాలి.
రియల్ స్టోరీల గురించి చెప్పే బుక్ నేపథ్యంతో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'కాజల్ కార్తీక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ చిత్రం ఇప్పటి వరకూ స్ట్రీమింగ్‌కు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆహా సంస్థ ఈ మూవీ హక్కులను తీసుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన 'కాజల్ కార్తీక' మూవీని ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ మేరకు తాజాగా సదరు సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనికి ఓ క్రేజీ పోస్టర్‌ను సైతం జోడించింది. ఇదిలా ఉండగా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొందనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. కాజల్ అగర్వాల్ - డికేయ్ కాంబినేషన్‌లో రూపొందిన 'కాజల్ కార్తీక' చిత్రాన్ని పావే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పాదర్తి పద్మజ నిర్మించారు. ఇందులో రెజీనా కసాండ్ర, జనని అయ్యర్, రైజా విల్సన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ హర్రర్ మూవీకి ప్రసాద్ ఎస్‌ఎన్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











