ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ హర్రర్ మూవీ.. భయపెట్టే ఈ సినిమా ఎక్కడ చూడాలంటే!
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న నటీనటుల నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకూ చాలా మంది హర్రర్ సినిమాలకే జై కొడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో ఈ తరహా చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా తమిళంలో రూపొందిన ఆంథాలజీ హర్రర్ సినిమానే 'కరుంగాపియం' / 'కాజల్ కార్తీక'.
రెజీనా కసాండ్ర, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్స్‌లో డికేయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే 'కాజల్ కార్తీక'. పుస్తకాలు చదివే పిచ్చి ఉన్న అమ్మాయికి.. రియల్ స్టోరీల గురించి చెప్పే బుక్ దొరకడం అనే కాన్సెప్టుతో ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలను కూడా ఏర్పరచుకుంది.

'కాజల్ కార్తీక' మూవీని 'కరుంగాపియం' పేరుతో గత ఏడాది మే 19వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, ఆరంభంలోనే దీనికి మంచి టాక్ లభించలేదు. ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. దాన్ని చూపించిన విధానం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫలితంగా ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశనే ఎదుర్కొంది.
డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొంది విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'కాజల్ కార్తీక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ చిత్రం ఇప్పటి వరకూ స్ట్రీమింగ్‌కు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆహా సంస్థ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా తెలిపింది.

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన 'కాజల్ కార్తీక' మూవీని ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగానే నేటి అర్ధరాత్రి నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఆహాలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోన్నట్లు తెలిసింది. దీంతో కాజల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఇదిలా ఉండగా.. కాజల్ అగర్వాల్ - డికేయ్ కలయికలో రూపొందుతోన్న 'కాజల్ కార్తీక' చిత్రాన్ని పావే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పాదర్తి పద్మజ నిర్మించారు. ఇందులో రెజీనా కసాండ్ర, జనని అయ్యర్, రైజా విల్సన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ హర్రర్ మూవీకి ప్రసాద్ ఎస్‌ఎన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











