ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ కొత్త సినిమా.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!

చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది చందమామ కాజల్ అగర్వాల్. దాదాపు దశాబ్ద కాలం పైగానే వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సైతం దూసుకుపోతోంది. ముఖ్యంగా క్రేజీ సినిమాలతో సత్తా చాటుతోంది. ఇలా ఇటీవలే కాజల్ అగర్వాల్ 'సత్యభామ' సినిమా చేసింది.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీనే 'సత్యభామ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు ప్రమోషన్ చేసి జూన్ 7వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేశారు.

Kajal Aggarwal Starrer Satyabhama Movie OTT Date Revealed

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్యభామ' సినిమా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఓపెనింగ్స్‌ను తక్కువగానే తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పెద్దగా రాణించలేకపోవడంతో విజయాన్ని అందుకోలేకపోయింది.

క్రేజీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సత్యభామ' సినిమాపై హైప్ క్రమంగా పెరగడంతో ఈ చిత్రం హక్కులకు పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తీవ్ర పోటీ నడుమ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు ప్లాట్‌ఫాం నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Kajal Aggarwal Starrer Satyabhama Movie OTT Date Revealed

కాజల్ అగర్వాల్ - సుమన్ చిక్కాల కలయికలో తెరకెక్కిన 'సత్యభామ' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని జూన్ 28వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. దీనిపై రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తాజాగా తెలిసింది.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన 'సత్యభామ' సినిమాను శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X