Satyabhama OTT: కాజల్ కొత్త సినిమా ఓటీటీ వివరాలు లీక్.. ఏంటి అన్ని రోజులకే వచ్చేస్తుందా!
గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్న చాలా మంది భామలు ప్రధాన పాత్రలను పోషించే సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ తరహా ప్రయోగాలు ఎంతో మంది చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 'సత్యభామ' అనే సినిమాను చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమానే 'సత్యభామ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని సుమన్ చిక్కాల తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించడంతో పాటు ప్రమోట్ చేసి జూన్ 7వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన 'సత్యభామ' సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, మొదటి రోజు ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఓపెనింగ్స్‌ను తక్కువగానే తెచ్చుకుంది. రెండో రోజు కూడా అదే రీతిలో స్పందనను అందుకుంది.
ఫుల్ లెంగ్త్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'సత్యభామ' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు ప్లాట్‌ఫాం నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కాజల్ అగర్వాల్ - సుమన్ చిక్కాల కాంబినేషన్‌లో రూపొందిన 'సత్యభామ' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఆహా సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే జూన్ 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం జూలై రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. కాజల్ అగర్వాల్ నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాను శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











