సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. ఈ మిస్టరీ మూవీని ఎందులో చూడాలంటే!
మిగిలిన అన్ని జోనర్లతో పోల్చుకుంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు అన్ని భాషల్లోనూ అదిరిపోయే స్పందన లభిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రాలు మరింతగా ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో అదే తరహా సినిమాలు మరింతగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'సత్యభామ' (Satyabhama).
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'సత్యభామ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని సుమన్ చిక్కాల రూపొందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలన్నీ ఆకట్టుకున్నాయి. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని జూన్ 7వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన 'సత్యభామ' సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది. కానీ, ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఇది ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను అందుకోలేక నిరాశ పరిచింది. దీంతో ఓపెనింగ్స్‌ను ఆశించిన రీతిలో తెచ్చుకోలేదు. ఆ తర్వాత కూడా పెద్దగా రాణించలేకపోవడంతో ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు.
పోలీస్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన 'సత్యభామ' సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం అన్ని హక్కులకు పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తీవ్ర పోటీ నడుమ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు ప్లాట్‌ఫాం నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

కాజల్ అగర్వాల్ - సుమన్ చిక్కాల కాంబినేషన్‌లో రూపొందిన 'సత్యభామ' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే ఉన్నట్లుండి ఈ చిత్రం గత అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో కాజల్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన 'సత్యభామ' సినిమాను శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్‌ను ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











