Niharika Konidela: అఖిల్ కు జోడిగా మెగా డాటర్.. నిహారికను 'ఆశ' అని పిలుస్తున్న డైరెక్టర్ కొడుకు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయమై టాలీవుడ్ లో హవాను కొనసాగిస్తున్నారు. అంతేకాదు, ఈ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. చాలా కాలం క్రితమే పరిచయమైన నిహారికను మెగా డాటర్ గా తెలుగు ఆడియెన్స్ పిలుచుకుంటారు. అయితే నిహారిక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ కు మాత్రం నోచుకేలేదు. ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న చెఫ్ మంత్ర సీజన్ లో ఇటీవల నిహారిక అండ్ కాలభైరవ పాల్గొన్నారు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

హీరోయిన్ గా చేయలేదు..

హీరోయిన్ గా చేయలేదు..

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తే, మెగా డాటర్ నిహారిక కొణిదెల 2016లో వచ్చిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన నిహారికి కొణిదెల తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ మూవీ మాత్రం అనుకున్నంత హిట్ కాలేదు. దీంతో మళ్లీ సినిమాలో హీరోయిన్ గా చేయలేదు. కానీ కొన్ని వెబ్ సిరీస్ లలో మాత్రం యాక్ట్ చేసింది.

స్కూల్ డేస్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్..

స్కూల్ డేస్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్..

ఈ సినిమాకు ముందు కూడా నిహారిక కొన్ని వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలీంలు చేసింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మంచు లక్ష్మీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న చెఫ్ మంత్ర సీజన్ 2 షోకి నిహారిక కొణిదెల, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ అతిథులుగా హాజరయ్యారు. వీళ్లిద్దరు స్కూల్ డేస్ నుంచే మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే వీళ్లలో ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసో టెస్ట్ చేసేందుకు ప్రయత్నించింది.

ఎవ్వరికీ తెలియదు..

ఎవ్వరికీ తెలియదు..

నిహారికను ఫ్రెండ్స్ అంతా ఏమని పిలుస్తారని కాలభైరవను మంచు లక్ష్మీ అడగ్గా.. సాధారణంగా అందరూ నిహా అని పిలుస్తారని, అతను మాత్రం ఆశ అని పిలుస్తానని చెప్పాడు. అలా ఎందుకు పిలుస్తాడో చెప్పుకొచ్చాడు. నిహారిక ఒక షార్ట్ ఫిలింలో నటించిందని కాలభైరవ అంటే.. 'కళాఖండం అంటారు దాన్ని' అని నిహారిక అంది. ''ఎవ్వరికీ తెలియదు కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ షార్ట్ ఫిలింలో నిహారిక క్యారెక్టర్ పేరు ఆశ.

డబ్బులు వస్తాయి, అమ్మేద్దామా..

డబ్బులు వస్తాయి, అమ్మేద్దామా..

ఆ షార్ట్ ఫిలిం మా ఇద్దరికీ మాత్రమే తెలుసు కాబట్టి ఆమెను నేను ఆశ అని పిలుస్తాను'' అని కాలభైరవ తెలిపాడు. మరి ఆ షార్ట్ ఫిలిం బయటకు ఎందుకు రాలేదు. అంతా బాగుందనా అని మంచు లక్ష్మీ ప్రశ్నకు కార్తికేయను, అఖిల్ ను అడగండి చెప్తారు అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది నిహారిక. ఆ షార్ట్ ఫిలీంలో అఖిల్ కోస్టార్ అని కాలభైరవ అని చెప్పాడు. దీంతో ఇప్పుడైతే ఈ షార్ట్ ఫిలింకు బోలెడన్ని డబ్బులు వస్తాయి. అమ్మేద్దామా అని మంచు లక్ష్మీ అన్నారు.

పరువు పోకుండా ఉండాలి..

వద్దు.. డబ్బులు వస్తాయని కాదు.. పరువు పోకుండా ఉండాలి. అది ఇంపార్టెంట్ అని నిహారిక్ సమాధానం ఇచ్చింది. ఆ షార్ట్ ఫిలిం ఒకసారి చూడలాని ఉందని లక్ష్మీ అంటే.. చూడటానికి మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. దాన్ని మీరు పాజ్ చేయలేరు. రివైండ్ చేసి చూడలేరు. ఒకసారి అక్కడ పాజ్ చేయి అని మీరు అనడానికి లేదు. చాలా అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ అలా వెళ్లిపోతూ ఉంటాయి అని నిహారికను ఉద్దేశించి అన్నాడు కార్తికేయ.

ఒక మనసు సినిమా కంటే ముందు..

ఒక మనసు సినిమా కంటే ముందు..

ఇలా నిహారిక, అక్కినేని అఖిల్ కలిసి ఒక షార్ట్ ఫిలింలో జోడి కట్టారని అర్థమైంది. అయితే 2016లో ఒక మనసు సినిమా కంటే ముందు ఈ షార్ట్ ఫిలిం చేశారు. ఒకవైపు బాహుబలి షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ షార్ట్ ఫిలింను తెరకెక్కించాడు కార్తికేయ. అయితే అంత బాగా రాకపోయే సరికి విడుదల చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X