2064లో కలియుగం ఎలా ఉంటుంది? ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ ఫిక్సన్ మూవీ.. ఎందులో అంటే?

గ్లామర్ షోకు దూరంగా కథాబలం ఉన్న సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్. అవసరమైతే తల్లిగానూ, వయసు మళ్లీన స్త్రీగానూ నటించడానికి ఏమాత్రం వెనుకాడరని గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధ. జెర్సీ చిత్రంతో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ.. డాకు మహారాజ్‌లో కలెక్టర్‌గా పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో మెప్పించారు. ప్రస్తుతం ఓటీటీల యుగంలో కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి శ్రద్ధ వంటి నటీమణులకు అవకాశం లభిస్తోంది. ఆమె నటించిన పలు చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ నటించిన కలియుగం 2064 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..

శ్రద్ధ- కిషోర్ జంటగా కలియుగం
క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫిక్సన్ సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఒరిజినల్ కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్‌లు జంటగా తెరకెక్కిన చిత్రం కలియగం 2064. ఇనియన్ సుబ్రహ్మణి, అజ్మల్, హ్యారీ, మిథున్, డేవిడ్ సంతోష్, మాస్టర్ రోనిత్, కేశవన్, ఆర్య తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్‌పై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Kaliyugam 2064 OTT Release Where to watch Shraddha Srinath and Kishore starring sci-fi thriller online

కలియుగం 2064 బడ్జెట్ ఎంత?
కలియుగం 2064 చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించగా.. కే రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. డాన్ విన్సెంట్‌ సంగీతం అందించారు. 2064లో ప్రపంచం ఎలా ఉండనుంది? అనే ఫిక్సన్ స్టోరీకి అనుగుణంగా నాటి కాలానికి తగిన విధంగా సెట్టింగ్స్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. నేచురల్ లోకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు రూ.4 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కలియుగం 2064 కలెక్షన్స్ ఎంత?
ఈ ఏడాది మే 9న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కలియుగం 2064 మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. తొలిరోజున రూ.30 లక్షలు, రెండో రోజున రూ.35 లక్షలు, మూడో రోజున రూ.28 లక్షలు చొప్పున కలియుగం 2064 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.93 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం వారం రోజుల లోపే కలియుగం 2064 మూవీ తన థియేట్రికల్ రన్ ముగించింది.

కలియుగం 2064 ఏ ఓటీటీలో?
ఇక శ్రద్ధా శ్రీనాథ్ మూవీ ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే.. కలియుగం 2064 సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్‌నెక్ట్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. థియేటర్‌లో విడుదలై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాకపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా కలియుగం 2064 ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి సన్‌నెక్ట్స్ సంస్థ ప్రకటన చేసింది. జూలై 11 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలియుగం 2064 మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో ఫర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X