Netflix: నెట్ ఫ్లిక్స్‌లో దుమ్ము లేపుతున్న కల్కి 2898 AD.. ప్రభాస్ మూవీకి అప్పుడే అన్ని లక్షల గంటలా వ్యూసా?
మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు ఇసీన్మ నుంచి వచ్చిన ఓ సినిమా 1000 కోట్లకి పైగా వసూళ్లు అందుకుని బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మరి ఆ సినిమానే ఇండియాస్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోన్ అలాగే దిశా పటాని ఇంకా ఎంతో మంది అగ్ర తారలు నటించిన సినిమానే "కల్కి 2898 ఎడి". దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ అండ్ అడ్రినలీన్ రష్ చిత్రం థియేటర్స్ లో భారీ వసూళ్లు అందుకొని అదరగొట్టింది.
అయితే థియేటర్స్ లో రన్ ని సక్సెస్ ఫుల్ అనుకున్న అన్ని వారాలు కంప్లీట్ చేసుకున్నాక ఈ చిత్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా పలు భాషల్లో రెండు స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే నెట్ ఫ్లిక్స్ లు తీసుకొచ్చాయి. వరల్డ్ వైడ్ గా రెండూ మంచి పాపులారిటీ ఉన్నవే..

వీటిలో తెలుగు, తమిళ్,కన్నడ అలాగే మళయాళ భాషల్లో ప్రైమ్ వీడియో వారు తీసుకొస్తే హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చారు. మరి అనుకున్నట్టే ప్రైమ్ వీడియోలో పక్కన పెడితే కల్కి హిందీ వెర్షన్ ఇప్పుడు ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ కొల్లగొడుతుంది. హిందీలో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకుంది.
కాగా ఇందులో ఈ సినిమా ఏకంగా 53 లక్షలకి పైగా వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో కొల్లగొట్టగా ఈ వారం రోజుల్లో కూడా ఏకంగా 13.1 మిలియన్ గంటల స్ట్రీమింగ్ ని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ లో గని హిందీ సినిమాలకి గాని అత్యధికం అన్నట్టు డార్లింగ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. నెట్ ఫ్లిక్స్ నుంచి అయితే వరల్డ్ వైడ్ రీచ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.

అందుకే కల్కి లాంటి సినిమాలకి తప్పకుండ నెట్ ఫ్లిక్స్ కే హిందీ హక్కులు అమ్ముతారు. గతంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. ఇలా కల్కి కూడా నెట్ ఫ్లిక్స్ లో మొదటి వారం లోనే రికార్డులు సెట్ చేస్తుంది. అయితే ఒక్క వ్యూస్, వీక్షించిన గంటల్లోనే కాకుండా కల్కి గ్లోబల్ ట్రెండింగ్ (నాన్ ఇంగ్లీష్) సినిమాల లిస్ట్ లో కూడా భారీ రెస్పాన్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇలా కల్కి ఇపుడు వరల్డ్ వైడ్ సినిమాల్లో రెండో ప్లేస్ లో అయితే ట్రెండ్ అవుతుందట. ఇలా ఓటిటిలో మాత్రం కల్కి ఇపుడు దుమ్ము లేపుతుంది అని చెప్పి తీరాలి. ఇది ఆరంభమే కాగా రానున్న రోజుల్లో కల్కి ఇంకెలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుంది అనేది కూడా కీలకంగా మారింది. మరి చూడాలి కల్కి ఇండియా లోనే హైయెస్ట్ వ్యూస్ అందుకున్న సినిమాగా నిలుస్తుందో లేదో అనేది.


Click it and Unblock the Notifications











