రిలీజ్‌కు ముందే ఓటిటిలో కల్కి సంచలనం.. వ్యూస్‌లో బిగ్ రికార్డు ఎలా సాధ్యమైందంటే?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర దుమ్ము లేపుతున్న భారీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే బాలీవడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో దీపికా పదుకొనె అలాగే దిశా పటాని హీరోయిన్స్ గా నటించిన సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రమే "కల్కి 2898 ఏడి". మరి యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటుండగా కొన్ని క్రేజీ లీక్స్ తో అయితే అసలు నాగ్ అశ్విన్ మెంటల్ మాస్ ప్లానింగ్ చూసి అంతా షాకవుతున్నారు.

కాగా నాగ్ అశ్విన్ కల్కి యూనివర్స్ ని అసలు ఆడియెన్స్ ఎవరూ ఊహించని పెద్ద సినిమాగా ప్లాన్ చేస్తున్నాడు. హాలీవుడ్ లో పలు సినిమాటిక్ యూనివర్స్ ల తరహాలో మన ఇతిహాసాలతో కలిపి ఈ తన సినిమాలు ప్లాన్ చేస్తుండగా అందులో సినిమా ఒక్కటే కాకుండా ఓటిటి వెర్షన్ లో కూడా యూనివర్సల్ అపీల్ ఉండే యానిమేషన్ వెబ్ సిరీస్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు నాగి.

kalki 2898 ad got record views even its ott release here is how

దీనితో ఆ కాన్సెప్ట్ కే చాలా మంది సలాం కొట్టారు. అలా ఓటిటిలో వచ్చిన ప్రీల్యూడ్ మంచి హిట్ అయ్యింది. పైగా కల్కి సినిమా చూడకముందు ఆ బుజ్జి ఏంటి? ప్రభాస్ హోలోగ్రాం లు ఎలా వచ్చాయి అనే లాంటివి ఇందులో చూపించాడు. దీనితో ఇంకా సినిమా ఓటిటిలోకి రాక ముందే కేవలం ఈ యానిమేటెడ్ సిరీస్ అది కూడా కేవలం రెండు ఎపిసోడ్స్ ప్రైమ్ వీడియోలో రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మన తెలుగులో ఈ ఏడాదిలో వచ్చిన కంటెంట్ వరకు కల్కి ఒక్కటే రికార్డు వ్యూస్ సాధించింది అట. ఇది బిగ్ రికార్డు అని చెప్పాలి. ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి. ఒకొకటి మినిమమ్ రెండు గంటలు వేసుకున్నా ఈ ప్రీల్యూడ్ లో కేవలం రెండు ఎపిసోడ్స్ అది కూడా సుమారు 20 నిమిషాల లోపే ఒకో ఎపిసోడ్ ఉంటుంది ఇది వాటి అన్నిటిని మించి భారీ వ్యూస్ అందుకోవడం విశేషమే అని చెప్పాలి.

kalki 2898 ad got record views even its ott release here is how

కాగా దీని బట్టి కల్కి కి ఓటిటిలో కూడా ఏ రేంజ్ ఆదరణ ఉందో అర్ధం చేసుకోవాలి. ఇక దీనికే ఇలా ఉంటె టోటల్ సినిమా ఓటిటిలోకి వచ్చాక ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేది చూడాలి. కాగా ఈ సినిమా హక్కులు రెండు ఓటిటి సంస్థలు సొంతం చేసుకున్నాయి. సౌత్ వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంటే నార్త్ సహా ఓవర్సీస్ భాషల హక్కులు ప్రపంచ నెంబర్ 1 ఓటిటి సంస్థ వారు సొంతం చేసుకున్నారు.

అలాగే ఈ చిత్రం మరో నెలన్నర వరకు ఓటిటిలో వచ్చే సూచనలు లేవు. ఇంకా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ తో సమానమైన పాత్రలో ఉలగనయగన్ కమల్ హాసన్ నటిస్తుండగా పార్ట్ 2 లో తనపై మరిన్ని సాలిడ్ సన్నివేశాలు ఉండనున్నాయి.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas nag ashwin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X