OTT రెండు ఓటీటీలో కల్కి 2898 AD.. అమెజాన్‌లోనే కాకుండా ఎందులో చూడొచ్చంటే?
ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది "కల్కి 2898 ఎడి (Kalki 2898 AD)" అని చెప్పవచ్చు. అలాగే ఈ ఏడాదికి ఇండియన్ సినిమా నుంచి మొట్ట మొదటి బిగ్గెస్ట్ రిలీజ్ కూడా ఇదే అని చెప్పాలి. ఏడాది ఆరంభంలో వచ్చిన "హను మాన్" పెద్ద హిట్ కాగా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సరైన సినిమా ఇప్పుడు వరకు రాలేదు.
మధ్యలో కొన్ని భారీ చిత్రాలు స్టార్ హీరోస్ నుంచి బాక్సాఫీస్ దగ్గర రావాల్సి ఉంది కానీ కొన్ని చిత్రాలు వాయిదా పడిపోయాయి. అలాగే కల్కి కూడా మొదట వాయిదా పడినప్పటికీ మొదటి స్పేస్ ని ఈ సినిమానే తీసుకొని థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది. కాగా ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ దిగ్గజ హీరోలు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు కూడా నటించగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ బరువైన బాధ్యతని తీసుకున్నాడు.

ఇక థియేట్రికల్ గానే గ్రాండ్ ట్రీట్ ఇచ్చే విధంగా బిగ్ స్క్రీన్స్ కోసమే తీసిన ఈ సినిమాకి ఓటిటి హక్కులు సంబంధించి క్లారిటీ కోసం కూడా చాలా మంది చూసారు. కాగా ఈ సినిమా ప్రీల్యూడ్ అంటూ వచ్చిన ఒక యానిమేషన్ వెబ్ సిరీస్ రెండు ఎపిసోడ్స్ రిలీజ్ చేసారు. అయితే దీనితో ప్రైమ్ వీడియోనే సినిమా కూడా కొనుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే కల్కి హక్కులు ఒక్క ప్రైమ్ వీడియో మాత్రమే కాకుండా మరో పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ప్రైమ్ వీడియోలో దక్షిణాది భాషలు స్ట్రీమింగ్ కి గాను నెట్ ఫ్లిక్స్ హిందీ భాషకి చెందిన హక్కులుకి గాను సొంతం చేసుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

దీనితో అయితే సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం వీటిలో స్ట్రీమ్ చేయవచ్చు. కాకపోతే ఈ సినిమా సుమారుగా రెండు నెలలు వరకు బయటకు రాదని వినికిడి. సో ఈ రెండు నెలలు కూడా థియేటర్స్ లోనే ఈ సినిమాని చూడాలి అని చెప్పాలి. ఇంకా ఈ భారీ చిత్రంలో ప్రధాన తారాగణం ప్రభాస్ తో పాటుగా ఉలగనయగన్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, పశుపతి తదితరులు నటించారు.
కాగా సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి తన కెరీర్ 50వ సినిమాగా ప్రత్యేకంగా తీసుకొని సంగీతం అందించాడు. అలాగే ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తన బ్యానర్ వైజయంతి మూవీస్ వారు సుమారు 600 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం సహా హిందీ భాషల్లో విడుదల అయ్యింది.


Click it and Unblock the Notifications











