ఓటీటీలోకి వచ్చేసిన కల్కి 2898 ఏడీ.. ఈ హాలీవుడ్ రేంజ్ సిరీస్‌ను ఎలా చూడాలంటే!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తమ రేంజ్‌ను పెంచుకోవడమే కాకుండా.. టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేస్తున్న హీరోలు కూడా కొందరు ఉన్నారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. అంతలా ఈ బడా హీరో వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్'తో భారీ హిట్ కొట్టి ఫుల్ జోష్‌తో ముందుకెళ్తున్నాడు.
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ప్రభాస్.. ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ ఒకటి. ఈ సినిమాపై ఆరంభంలోనే భారీ అంచనాలు ఏర్పడగా.. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. టైం ట్రావెల్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుంది.

విజువల్ వండర్‌గా రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షూట్ చేసి ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు.
'కల్కి 2898 ఏడీ' ప్రమోషన్‌లో భాగంగా ఇండియాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా యానిమేటెడ్ సిరీస్‌ను సైతం విడుదలకు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే 'బుజ్జి అండ్ భైరవ' అనే టైటిల్‌తో రూపొందిన ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకు వచ్చారు. గత అర్ధరాత్రి నుంచి ఇది స్ట్రీమింగ్ ప్రారంభం అయింది.

'కల్కి 2898 ఏడీ' మూవీ యానిమేటెడ్ సిరీస్ అయిన 'బుజ్జి అండ్ భైరవ' నాలుగు ఎపిసోడ్స్‌తో రూపొందింది. అందులో రెండింటిని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సంస్థ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది. మిగిలిన రెండింటిని సినిమా రిలీజ్ అయిన తర్వాత అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఇక 'బుజ్జి అండ్ భైరవ' సిరీస్‌కు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











