Kalki 2898 AD OTT Release: కల్కి ఓటీటీ బిజినెస్ ఎంత? ప్రభాస్ మూవీ ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?

కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సంపాదించడమే కాకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించిన ఈ సినిమా థియేట్రికల్ జర్నీని కొనసాగిస్తూనే ఓటీటీ రిలీజ్ డేట్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎంతకు అమ్ముడుపోయాయి? ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే వివరాల్లోకి వెళితే..

కల్కి సినిమాను సుమారుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రైట్స్ చెల్లించి అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌ సొంతం చేసుకొన్నది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. కల్కి సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 375 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

Kalki 2898 AD movie is doing best business at Box Office Report Here is the movie OTT release date

థియేట్రికల్ రైట్స్ సుమారుగా 372 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమా గత 15 రోజుల్లో ఇప్పటి వరకు ఈ సినిమా 945 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. త్వరలోనే ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

అయితే కల్కి సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ అయింది కాబట్టి.. తప్పకుండా బాలీవుడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం వచ్చింది. అయితే తెలుగు, ఇతర భాషల్లో అయితే పెద్దగా ప్రమాణికంగా నిబంధనలు అంటూ లేవు. బాలీవుడ్ సినిమా రంగంలో ఎలాంటి సినిమానైనా కనీసం 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంటుందనే రూల్ పాటించాల్సి ఉంటుంది.

Kalki 2898 AD movie is doing best business at Box Office Report Here is the movie OTT release date

అయితే హిందీ నిర్మాతల ఒప్పందం ప్రకారం.. ఈ సినిమాను కనీసం 50 రోజుల తర్వాత రిలీజ్ అవ్వాల్సి ఉంది. జూన్ 27వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఓటీటీలోకి సెప్టెంబర్ తొలివారంలో గానీ.. లేదా రెండో వారంలో గానీ రిలీజ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే అప్పటి వరకు కూడా కొన్ని చోట్ల థియేట్రికల్ రన్ అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతాయి. అలాగే హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోన్నది. దాంతో ఆ వెర్షన్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది అని నిర్వాహకులు తెలిపారు.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X