OTT: RRR రికార్డులపై గురిపెట్టిన కల్కి 2898 AD.. ఓటీటీలో టాప్ ఫైట్ కు రంగం సిద్ధం!
ఒకప్పుడు తెలుగు సినిమా వేరు ఇప్పుడు తెలుగు సినిమా వేరు అని చాలా మందికి ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇలా తెలుగు నుంచి వచ్చిన భారీ చిత్రాలు వరల్డ్ వైడ్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకోగా ఇప్పుడు మరిన్ని చిత్రాలు పాన్ ఇండియా నుంచి గ్లోబల్ లెవెల్ ఫేమ్ పై కన్నేస్తున్నాయి. అయితే మన ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పతాక స్థాయిలోకి వెళ్ళింది మాత్రం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి RRR వల్లనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అదేంటి బాహుబలి వల్ల కూడా కదా అంటే? బాహుబలి పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా గేట్లు విస్తరిస్తే RRR సినిమా ఏకంగా ప్రపంచ ఆడియెన్స్ నే ఊపేసి ఫేమ్ ని సొంతం చేసుకుంది. ఇది కొంచెం పక్కన పెడితే రీసెంట్ గా వచ్చిన మరో ప్రైడ్ ఇండియన్ సినిమా "కల్కి 2898 ఎడి" కోసం కూడా మాట్లాడుకోవాలి. ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో వచ్చింది.

అయితే అక్కడ RRR లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు ప్రభాస్ తో సమానమైన హీరోస్ ఉన్నారు కానీ కల్కి ఆ సినిమాకి దగ్గర వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొట్టేసింది. దీనితో కల్కి కూడా ఎంత పెద్ద హిట్ అనేది మనం అర్ధం చేసుకోవచ్చు. అయ్యితే ఇపుడు ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు కల్కి 2898 ఎడి సిద్ధం అయ్యింది. వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు మొదటిగా సౌత్ భాషల్లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
అయితే మునుపెన్నడూ లేని విధంగా కల్కి 2898 ఎడి హిందీ వెర్షన్ ని కూడా అదే ఆగష్టు 22న తెచ్చేస్తున్నాం అంటూ నెట్ ఫ్లిక్స్ కూడా బిగ్ అప్డేట్ ఇవ్వడం వైరల్ గా మారింది. ఇలా రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఒకేరోజు అప్డేట్ ఇచ్చింది గతంలో కూడా జరగలేదు. అయితే ఇక్కడ అంచనాలు ఒరిజినల్ తెలుగు ఓటిటి రిలీజ్ కంటే హిందీ వెర్షన్ తీసుకొస్తున్న నెట్ ఫ్లిక్స్ పైనే ఉన్నాయని చెప్పాలి.
ఎందుకంటే మన ఇండియన్ సినిమా నుంచి నెట్ ఫ్లిక్స్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది RRR సినిమానే అని చెప్పాలి. ఇపుడు కల్కి ముందు RRR తో రెండు పెద్ద టాస్క్ లు ఉన్నాయి. మొదటిది RRR రేంజ్ లో కల్కి కూడా రికార్డు వారాలు ట్రెండ్ అవుతుందా అనేది ఉంది. నెట్ ఫ్లిక్స్ లో RRR సినిమా దాదాపు 15 వారాలకి పైగానే వరల్డ్ వైడ్ గా టాప్ 10 లో ట్రెండింగ్ లో నిలిచింది.

ఇది ఏ ఇండియన్ సినిమాకి అయినా కూడా అత్యధికం కాగా దీనితో పాటుగా దీనికి మించిన టాస్క్ కల్కి ముందు ఉంది.. ఇదేమిటంటే RRR సినిమాకి వరల్డ్ వైడ్ ఇంత ఫేమ్ రావడానికి అసలు కారణమే నెట్ ఫ్లిక్స్. ఒక్కసారి హిందీలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ ఊహించని లెవెల్లో వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళు అలానే RRR సినిమా చూసి ఫిదా అయ్యిపోయారు.
మరి ఇప్పుడు కల్కి కూడా ఇదే తరహాలో క్లిక్ అయితే మాత్రం ఇది కూడా ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కల్కిలో ఇంకా ఇంకా యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మరింతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ పెద్ద టాస్క్ ని కొట్టే సత్తా కల్కిలో ఉందో లేదో తెలియాలి అంటే ఈ ఆగస్ట్ 22 వరకు ఆగి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











