Kalki 2898 AD OTT Release Date: కల్కి ఓటీటీ రిలీజ్ రూమర్లకు చెక్.. ఆ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సిబుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే..
కల్కి చిత్రం రిలీజ్ రోజు నుంచే వరల్డ్ బాక్సాఫీస్ అత్యధిక వసూళ్లను నమోదు చేస్తూ తుఫాన్‌ను మరిపించేలా చేసింది. కేవలం 16 రోజుల్లో 1000 కోట్లు సాధించి పలు హీరోల లైఫ్ టైమ్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటికీ ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. సుమారుగా 1060 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

ఇక కల్కి సినిమా ఓటీటీ రైట్స్ బిజినెస్ మూవీ రిలీజ్ కంటే ముందే పూర్తయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో, హిందీ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నాయి.
అయితే సాధారణంగా సినిమా హిట్ అయితే 8 వారాల తర్వాత, పెద్దగా ఆడని సినిమాలు వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ఆనవాయితీ కొనసాగుతున్నది. అయితే ఈ సినిమా 8వ వారం తర్వాత ఓటీటీలోకి వస్తుందని అందరూ ఊహించడమే కాకుండా తాత్కాలికమైన డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.

అయితే మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ.. ఇటీవల వైజయంతీ మూవీస్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీని 10 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ చేస్తామని ఊహగానాలు, రూమర్లకు తెర దించారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌గా ఇంకా కొన్ని వారాలు కొనసాగుతుందనే విషయం స్పష్టమైంది.
వైజయంతీ మూవీస్ పేర్కొన్న ప్రకారం.. కల్కి మూవీ 10 వారాల తర్వాత అంటే.. ఈ మూవీ సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్, నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











