అమిగోస్ ఓటీటీ హక్కులను సోంతం చేసుకున్న టాప్ ఓటీటీ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా శుక్రవారం రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేంద్ర తెరపైకి తీసుకువచ్చాడు. మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ తో మనుషులు పోలిన మనుషుల కాన్సెప్ట్ ఈ సినిమాను కథను దర్శకుడు రాసుకున్నాడు. ఇక ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు.
ఇప్పటికే ప్రత్యేకమైన షోలను వీక్షించిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో తన అన్నయ్య నటన అద్భుతంగా ఉంది అని యాక్షన్స్ అన్వేషాలు కూడా అందరిని ఆకట్టుకుంటాయి అని పాజిటివ్ గా స్పందించారు. అమీగోస్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు ముందు నుంచే పోటీపడ్డాయి. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే వారి కంటే ఎక్కువ స్థాయిలో ఆఫర్ ప్రకటించిన ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఇక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే రెండు నెలల తర్వాతనే ఈ సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది.
అయితే సినిమా ఫలితాన్ని బట్టి ఏమాత్రం తేడా వచ్చినా కూడా అంతకంటే ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు నెట్ ఫ్లిక్స్ ప్రత్యేకంగా నిర్మాతలకు కొంత అమౌంట్ కూడా చెల్లిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది మొదటివారం గడిస్తే గాని తెలియదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.ప్రకారం అయితే కళ్యాణ్ రామ్ సినిమాకు ఓవర్గం ప్రేక్షకుల నుంచి విభిన్నమైన టాక్ వినిపిస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే బీసీ సెంటర్లలో ఈ సినిమా మంచి వసూళ్లను అందుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











