Amigos OTT: అమిగోస్ ఓటీటీ డేట్ ఫిక్స్.. నందమూరి ఫ్యాన్స్ బిగ్ షాక్
నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి నటన, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా తక్కువ హిట్లనే ఖాతాలో వేసుకున్న అతడు.. గత ఏడాది వచ్చిన 'బింబిసార'తో బిగ్గెస్ట్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కల్యాణ్ రామ్ 'అమిగోస్' అనే సినిమాను చేశాడు. ఇందులో అతడు ట్రిపుల్ రోల్ చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన మాత్రం దక్కలేదు. ఫలితంగా దీనికి కలెక్షన్లు కూడా అంతగా రాలేదు. దీంతో 'అమిగోస్' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

థియేటర్లలో ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయిన 'అమిగోస్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని విడుదలైన నెల రోజులకు అంటే మార్చి 10వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. మొత్తానికి దీన్ని ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయడంపై నందమూరి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.
కల్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన సినిమానే 'అమిగోస్'. డాపుల్ గ్యాంగర్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











