Amigos OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన అమిగోస్.. లేట్ అవడానికి కారణం ఏంటంటే!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. దీనికితోడు హీరోగా, నిర్మాతగా నిరంతరం కష్టపడుతూ ప్రేక్షకులకు మంచి మంచి, విభిన్నమైన చిత్రాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గత ఏడాది 'బింబిసార'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే కల్యాణ్ రామ్ 'అమిగోస్' అనే సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అతడు త్రిపాత్రాభినయం చేయడంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' మూవీని రాజేంద్ర రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాల నడుమ ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ఆశించిన రీతిలో స్పందన మాత్రం దక్కలేదు. ఫలితంగా దీనికి కలెక్షన్లు కూడా అంతగా రాలేదు. దీంతో 'అమిగోస్' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది.

Kalyan Ram Amigos Movie Streaming Starts on Netflix

బిగ్ స్క్రీన్‌పై నిరాశ పరిచిన 'అమిగోస్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నేటి నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇందులో మాత్రం కల్యాణ్ రామ్ సినిమాకు మంచి స్పందన వస్తోందని తెలిసింది. ఇక, ఇది ఆలస్యం అవడానికి కారణం నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందమేనని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా.. రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన చిత్రమే 'అమిగోస్'. డాపుల్ గ్యాంగర్ అనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X