Bimbisara సినిమా ఓటీటీ లో రిలీజ్ అప్పుడే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎంతో కాలంగా బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఆ మధ్య వరుస అపజయాలతో కాస్త సతమతమయ్యాడు. ఇక మొత్తంగా అతను బింబిసార సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ తో ఒక రికార్డు క్రియేట్ చేశాడు. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకుంది.
యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాగా కొత్త దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఈ సినిమాలో బింబిసార పాత్రలో కళ్యాణ్ రామ్ నటించిన విధానం కూడా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించేలా చేసింది. పోటీగా మరో సినిమా సీతారామం మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికీ కూడా బింబిసార సినిమా మూడు వారాలపాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనం ఇచ్చింది.

ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని మరికొందరు ఎదురుచూస్తున్నారు. ఇక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే రెండు నెలల తర్వాతనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు అక్టోబర్ దసరా సమయంలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అక్టోబర్ 7వ తేదీన బింబిసార సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ5 ఈ సినిమా హక్కులను సొంతం చేసుకకుంది. అందులోనే దసరా సమయంలోనే విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యుల నుంచి కూడా అధికారికంగా ఒక ప్రకటన రానుంది అలాగే బింబిసార సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











