Bimbisara OTT: ఎట్టకేలకు ఆ ఓటీటీలో బింబిసార.. ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటే!
ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే బిగ్ స్టార్లుగా ఎదిగిపోయారు. వీళ్లిద్దరి తర్వాత కాస్త ప్రభావాన్ని చూపించిన హీరో మాత్రం కల్యాణ్ రామ్ అనే చెప్పాలి. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హీరోగా సందడి చేస్తోన్న అతడు.. నిర్మాతగానూ వ్యవహరిస్తూ ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఫలితంగా కొన్ని విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కల్యాణ్ రామ్ 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
నందమూరి కల్యాణ్ రామ్ సోషియో ఫాంటసీ జోనర్‌లో చేసిన చిత్రమే 'బింబిసార'. టైం ట్రావెల్ కాన్సెప్టుతో మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రానికి రూ. 40 కోట్లకు పైగా షేర్ వసూలు అయింది. దీంతో రూ. 22 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతం అయ్యాయి.

సూపర్ హిట్ టాక్‌తో థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన 'బింబిసార' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చాలా రకలా వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. అంతేకాదు, ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, రెండు నెలలు దాటినా దీన్ని స్ట్రీమింగ్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. దీన్ని అక్టోబర్ 21వ తేదీ నుంచి జీ5లో ప్రసారం చేయబోతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా వెలువడింది. ఇక, చిత్ర యూనిట్ ముందుగా చేసుకున్న ఒప్పందం కారణంగానే ఈ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యం అయిందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట తెరకెక్కించిన సినిమానే 'బింబిసార'. ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











