Amigos OTT: కళ్యాణ్ రామ్ అమిగోస్ ఓటీటీ రిలీజ్ మారినట్లే.. అనుకున్న డేట్ కంటే ముందుగానే?
కళ్యాణ్ రామ్ నటించిన డిఫరెంట్ యాక్షన్ మూవీ అమిగోస్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో నటించి ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అయితే సినిమా కలెక్షన్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాలేవు. గత సినిమా బింబిసారతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఈసారి మాత్రం అమిగోస్ చిత్రంతో కొంత నిరాశపరిచాడు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.
అయితే ఈ సినిమాను ఓటీటీలో తొందరగానే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి వీకెండ్ తప్పితే ఆ తర్వాత మళ్లీ కలెక్షన్స్ ఏమీ పెద్దగా పెరగలేదు. అంతేకాకుండా ఈ వారం కూడా కలెక్షన్స్ చాలా వరకు డౌన్ అయ్యాయి. థియేటర్ల సంఖ్య కూడా అంతకంతకు తగ్గుతూనే ఉంది. అయితే అమిగోస్ సినిమాను చిత్రం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తొందరగానే ఓటీటీ కి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మార్చి మొదటి వారంలోనే అమిగోస్ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసలు అయితే థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లలో ఈ సినిమాకు జనాలు లేక వెలవెలబోతూ ఉండడంతో కనీసం ఓటీటీ లో అయినా తొందరగా విడుదల చేసి కొంత ప్రాఫిట్ అందుకోవాలి అని చిత్ర నిర్మాతలు అనుకుంటున్నారు.
దానికి తోడు ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలో కూడా విడుదలవుతున్నాయి. అందులో ధనుష్ సార్ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆ సినిమా సక్సెస్ అయితే అమిగోస్ థియేటర్స్ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక సినిమాకు కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక త్వరలోనే ఓటీటీ విడుదలపై అధికారికంగా నిర్మాణ సంస్థ క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











